2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు: శ్రీకాంత్

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న రిలీజవుతుంది. ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఓటర్ ని ఆలోచింపజేసేలా ఉంటుంది అని చెప్పుకున్నాడు హీరో శ్రీకాంత్. దాంతో పాటు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అదే నా నమ్మకం

డిసెంబర్ 1 న రిలీజవుతుంది సినిమా. ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మరో 2 రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఆపరేషన్ దుర్యోధన కన్నా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నా నమ్మకం.

2.0 ఎఫెక్ట్…

2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు. సినిమా బావుంటే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా డెఫ్ఫినేట్ గా ఆడతాయి.

బివేర్ ఆఫ్ పబ్లిక్…

ప్రజాస్వామ్యంలో పబ్లిక్ బాధ్యత ఏంటనేది ఈ సినిమాలో డిస్కస్ చేస్తున్నాం. ఒకానొక పాయింట్ లో పాలిటీషియన్స్ డబ్బులు దండుకోవడం కూడా తప్పు కాదేమో అని పాయింట్ ని రేజ్ చేశాం.

అదే అసలు కథ…

ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు, ఫారిన్ కి వెళ్ళి వచ్చి, తన సమస్యను పొలిటీషియన్స్ దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురుకున్నాడు..? అనేది సినిమాకి మెయిన్ టర్నింగ్ పాయింట్. అప్పుడు వాళ్ళపై కోపంతో పాలిటిక్స్ లోకి వచ్చిన ఆ యువకుడు, ఏం తెలుసుకున్నాడు..? నిజంగా ప్రజాస్వామ్యంలో తప్పు కేవలం పాలిటీషియన్సే చేస్తున్నారా..? ఆ తప్పుల్లో ప్రజల పర్సంటేజ్ ఎంత ఉందనేదే ఈ సినిమా.

ఆలోచన కోసమే…

సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఇది నిజమే కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. పర్టికులర్ గా మనం (జనాలు) చేసే తప్పులు, నాయకులను ఎన్నుకునే ప్రాసెస్ దగ్గరి నుండి, ఓటు హక్కు దుర్వినియోగం అనేది మన భవిష్యత్తును ఎలా దిగజారుస్తుందనేది ఈ సినిమాలో డిస్కస్ చేశాం… అది అందరికీ రీచ్ అవుతుందనే నా ఫీలింగ్.

మనోజ్ రోల్…

సినిమాలో మనోజ్ రోల్ హైలెట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ కి తనే పర్ఫెక్ట్. ఆ ఇంపాక్ట్ రేపు థియేటర్స్ లో కనిపిస్తుంది.

లైఫ్ మొత్తం ఇండస్ట్రీలోనే…

ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చాను. అలా కాకుండా విలన్ రోల్స్ వచ్చాయి. ఇంకా ఇష్టంగా చేసుకున్నా… ఆ తరవాత హీరోగా చేశా.ఇప్పుడు కూడా అంతే, హీరోగా మంచి సినిమా వచ్చినా చేస్తా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి వేషం వచ్చినా చేస్తా, ఏది ఏమైనా ఇండస్ట్రీలోనే ఉంటా..

ప్రభుదేవా తో రోహన్…

రోహన్ ప్రభుదేవా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ హిందీ భాషల్లో వస్తుంది. ఈ సినిమాలో ప్రభుదేవా కొడుకుగా నటిస్తున్నాడు రోహన్. రోషన్ ని 2019 లో గ్రాండ్ గా లాంచ్ చేద్దామనుకుంటున్నాం. ఎలా ఏంటనేది ప్లాన్ చేసుకోవాలి.

ప్రస్తుతం…

మార్షల్ అని జయరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నా. మరోవైపు ‘తెలంగాణ దేవుడు’ కూడా చేస్తున్నా. మార్షల్ పెద్ద బడ్జెట్ సినిమా. నాతో పాటు ఆ సినిమాలో ఇంకో హీరో ఉంటాడు.

మ్యూజిక్ సూపర్బ్…

రావ్ రాక్ షకీల్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సినిమాలో అన్ని సాంగ్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాయి. ‘వందేమాతరం’ సాంగ్ కాళభైరవ పాడాడు. ఆ సాంగ్ వింటే A.R. రెహమాన్ కంపోజ్ చేసిన సాంగా అనిపిస్తుంది. అంత ఫీల్ తో కంపోజ్ చేశాడు షకీల్.అదే కాన్ఫిడెన్స్…

ఆపరేషన్ దుర్యోధనలో కూడా ఏ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, ఏదైతే చెప్పాలనుకున్నామో, అదే స్ట్రేట్ గా చెప్పాం. సినిమాని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా విషయంలో కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది.

మెచ్యూర్డ్ రోల్స్…

నేను ఫాదర్ రోల్స్ చేస్తే ఆక్సెప్ట్ చేస్తారో లేదో అనే అనుమానం ఉంది. నాకే నేనింకా యంగ్ అనే ఫీలింగ్ ఉంటుంది లోపల్లోపల. ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఫాదర్ రోల్స్ చేస్తా…