ప్రైజ్‌మనీని కట్ చేస్తోన్న బిగ్‌బాస్.. ‘‘కుక్క’’ సామెతపై శ్రీహాన్- కీర్తి గొడవ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ సీజన్‌లోనూ లేని విధంగా బిగ్‌బాస్ 6 తెలుగు చప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్.. అప్పట్లోనే వెళ్లిపోవాల్సిందిగా గేట్స్ ఓపెన్ చేశాడు. తర్వాత ప్రేక్షకులను అలరించడానికి తానే రంగంలోకి దిగాడు. ఇక..తాజాగా బిగ్‌బాస్ టైటిల్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసినట్లు చేసి.. సరకు లేనివాళ్లకు అంత మొత్తం ఎందుకులే అనుకున్నాడో ఏమో కానీ కటింగ్స్ మొదలెట్టాడు. ఇప్పటికే రకరకాల టాస్కులతో ప్రైజ్ మనీని రూ.44 లక్షలకు తెచ్చేసిన బిగ్‌బాస్ మరింత కట్ చేస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌ను షురూ చేశాడు. అదే బీబీ ట్రక్కు . ఇది ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగుతూ వెళుతుంది. ఎవరైతే ముందుగా వచ్చి ట్రక్కు ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అంతా బాగానే వున్నప్పటికీ ఇక్కడే మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ప్రతి స్టాప్‌లో కంటెస్టెంట్స్ ట్రక్కు ఎక్కేందుకు ఓ ధర వుంటుందని, దానిని ప్రైజ్‌మనీలోంచి తీసేస్తామని చెప్పాడు. అలాగే ట్రక్కు ఎక్కలేకపోయిన కంటెస్టెంట్స్ కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే.. వారిలో ఎవరు కెప్టెన్సీ టాస్కులో పాల్గొంటారు... ఎవరు రేసు నుంచి తప్పుకోవాలో కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైనవారు ఫైనల్ చేస్తారు.
ఇక టాస్క్ మొదలయ్యాక ఆదిరెడ్డి గెలిచాడు.. తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం అతను లక్ష రూపాయలు వెచ్చించాడు. తర్వాత రేవంత్ రూ.25 వేలు, రోహిత్ రూ.45,000.. శ్రీహాన్ రూ.30,000..ఇనయా రూ.70,000లు ఖర్చు చేశారు. మొత్తం మీద కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు మిగుల్చుకున్న బిగ్‌బాస్... చివరికి ప్రైజ్‌మనీని 31,00,300కి చేర్చారు. ఫైనల్‌గా అన్ని రౌండ్స్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయాలు అర్హత సాధించారు.
ఈరోజు బీబీ ట్రాన్స్‌పోర్ట్ టాస్క్‌లో మరోసారి కీర్తిని టార్గెట్ చేశాడు శ్రీహాన్. ఆమెను కెప్టెన్సీకి అనర్హురాలిగా ప్రకటిస్తూ అర్థం పర్థం లేని రీజన్స్ చెప్పాడు. గత వారం థర్మాకోల్ బాల్స్ ఆటలో .. బ్యాగ్ కిందపెట్టేసి గివ్ అప్ ఇచ్చిందని గుర్తు చేశాడు. అయినా ఏం మాట్లాడని కీర్తి తన టైం కోసం వెయిట్ చేసింది. తర్వాతి రౌండ్‌లో శ్రీహాన్‌ని అనర్హుడిగా ప్రకటించి షాకిచ్చింది. ఆమె శ్రీహాన్ పేరు చెప్పగానే... మంచినీరు తాగుతున్న వాడల్లా దగ్గడం, పోలమారినట్లుగా యాక్ట్ చేస్తూ వెకిలి చేష్టలు చేశాడు.
దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో రెండు మూడు వారాల నాటి ‘‘కుక్క’’ టాపిక్ బయటకు తీసుకొచ్చాడు శ్రీహాన్. అప్పట్లో కీర్తి, మెరీనా మాట్లాడుకుంటూ వుండగా.. కుక్కలు అరిస్తే దేవలోకానికి వచ్చే నష్టమేమీ లేదంటూ’’ కన్నడలో వున్న ఓ సామెత చెబుతుంది. దీనిని బయటకు తెచ్చిన శ్రీహాన్.. ఇంటి సభ్యుల్ని కుక్కలతో పోల్చిన వాళ్లు బిహేవియర్ గురించి మాట్లాడుతున్నారని టాపిక్‌ని డైవర్ట్ చేశాడు. హౌస్‌మెట్స్‌ని కుక్కల గురించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదని లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీనికి కీర్తి కూడా ధీటుగానే బదులిచ్చింది. తాను ఎవరి పేరు చెప్పలేదని.. కేవలం సామెత మాత్రమే చెప్పానని ఆన్సర్ ఇచ్చింది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో.. హౌస్‌లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com