BiggBoss: ఇనయా కత్తిపోటు.. ఊసరవెల్లి లాంటిదంటూ శ్రీహాన్ ఫైర్, కొత్త కెప్టెన్ అతడే
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న మొన్నటి వరకు పరమ బోర్ కొట్టిన బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. బిగ్‌బాస్ గడ్డిపెట్టడంతో పాటు కొత్త కొత్త టాస్కులతో ఆటలో మజా కనిపిస్తోంది. కంటెస్టెంట్స్ కూడా తీరు మార్చుకుని దూకుడుగా ఆడుతున్నారు. ఒక్కొక్కరు తెలివిగా తమ స్ట్రాటజీని మారుస్తూ.. గెలిచేందుకు, వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే... కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఇంటిలో ‘‘చేపల చెరువు’’ టాస్క్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. నిన్న రేవంత్- ఇనయాలు టాప్‌లో వున్నప్పటికీ.. గీతూ పాప ఎత్తుగడకి బలైయ్యారు. అందరికంటే ఎక్కువ చేపలు సంపాదించినప్పటికీ.. నల్ల చేప కారణంగా కెప్టెన్సీ టాస్క్ నుంచి సైడ్ అవ్వాల్సి వచ్చింది. స్వాప్ కారణంగా శ్రీహాన్- శ్రీసత్య జంట నేరుగా కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. మిగిలిన నాలుగు జంటలు .. చర్చించుకుని తమలో ఒకరిని కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించాలని చెప్పాడు. దీంతో రేవంత్- ఇనయా జోడీ నుంచి రేవంత్, సూర్య- వాసంతి జోడీ నుంచి సూర్య, రోహిత్- కీర్తి జోడీ నుంచి కీర్తి, ఫైమా- రాజ్ జోడీ నుంచి ఫైమాలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడ్డారు.
అయితే ఇనయా ఆటతీరు మరోసారి చర్చనీయాంశమైంది. తనకు శ్రీహాన్, సూర్యలు తన దృష్టిలో కంటెస్టెంట్స్ మాత్రమేనని చెప్పింది ఇనయా. రెండు వారాలుగా శ్రీహాన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ఆమె.. మళ్లీ సూర్యను గోకుతోంది. తనకు కెప్టెన్సీ పోటీదారుగా ఛాన్స్ రాలేదంటూ వాష్‌రూమ్‌లో సూర్యను పట్టుకుని ఏడ్చేసింది. కెప్టెన్సీ పోటీదారుగా ఛాన్స్ ఇవ్వాలని రేవంత్‌ను బతిమలాడానని వాపోయింది. సూర్య ఎంతగా ఓదార్చినా ఇనయా బాధపడుతూనే వుంది.
తర్వాత రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఫైమాలు కెప్టెన్సీ పోరులో తలపడగా.. వీరికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. దీనికి వాసంతి సంచాలక్‌గా వ్యవహరించింది. తొలుత రేవంత్ డిస్ క్వాలిఫై అవ్వగా.. సూర్య, కీర్తి, శ్రీహాన్‌లు అందరికంటే ముందు చిక్కుముళ్లు విప్పి కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. అనంతరం ఈ ముగ్గురికి కెప్టెన్ అవ్వడానికి అడుక్కునే ప్రాసెస్ పెట్టారు బిగ్‌బాస్. ఒక్కొక్కరూ కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి.. తనకు సపోర్ట్ చేయి అని అడుక్కోవాలి. తాము కెప్టెన్సీకి ఎందుకు అర్హులమో వివరించాలి. తర్వాత వారి మెడలో సీ అనే మెత్తని అక్షరాన్ని వేలాడదీసిన బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్ కెప్టెన్‌గా వద్దు అనుకుంటున్న వారిని కత్తితో గుచ్చాలని చెప్పాడు. అనంతరం రాజ్, రోహిత్, రేవంత్.... సూర్యకు, బాలాదిత్య, గీతూ... కీర్తికి, ఇనయా.. శ్రీహాన్‌కు కత్తిపోటు పొడిచింది.
ఇన్ని రోజుల నుంచి తనతో ఎంతో బాగుంటున్న ఇనయా తనకు కత్తి గుచ్చడాన్ని శ్రీహాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. తన పక్కన వున్న వారితో ఇనయా ఊసరవెళ్లి లాంటిదని, వారానికొకరితో వుంటుందని కామెంట్ చేశాడు. నాకు నమ్మక ద్రోహం చేసింది.. సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక అందరి మద్ధతుతో శ్రీహాన్ కెప్టెన్‌గా గెలిచాడు. అయితే ఎపిసోడ్ ముగియడంతో ఆ వివరాల్ని చూపించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com