BiggBoss: సండే నో ఎలిమినేషన్.. శ్రీహాన్ ‘‘కన్నింగ్’’, ఇనయా ‘‘మహానటి’’
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి ఎపిసోడ్లో సూర్యను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు కింగ్ నాగార్జున. దీంతో కంటెస్టెంట్స్‌కు ఏం అర్ధం కాక అలా చూస్తుండిపోయారు. కీర్తి, ఫైమాలు బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇనయా సంగతి సరే సరి. సూర్య చేతిని పట్టుకుని ముద్దులు పెడుతూ.. అతను వెళ్లగానే గుమ్మం దగ్గర కూలబడిపోయి ఏడుస్తూనే వుంది. దీంతో సూర్య నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? లేక సీక్రెట్ రూమ్‌కి వెళ్లాడా అన్నది అర్ధం కాక కంటెస్టెంట్స్, ప్రేక్షకులు జుట్టు పీక్కున్నారు. మరి ఈ సస్పెన్స్‌కు బిగ్‌బాస్ తెరదించాడో లేదో చూస్తే.
ఎపిసోడ్ ప్రారంభం కాగానే సూర్యను స్టేజ్‌పైకి పిలిచారు నాగార్జున. ఈ సందర్భంగా అతని జర్నీని ప్లే చేసి చూపించారు. అనంతరం సూర్యకి ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్‌మేట్స్‌లో ఎవరు ఫైర్, ఎవరు ఫ్లవరో చెప్పాలని కోరారు. దీనికి ఫైమా, ఇనయా, రాజ్, కీర్తిలు ఫైర్ లిస్ట్‌లో.. రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్యలను ఫ్లవర్స్ లిస్ట్‌లో చెప్పాడు సూర్య, ఇక ఇనయా గురించి మాట్లాడుతూ... తొలి రోజుల్లో కొట్టుకున్నామని, ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదని చెప్పాడు. నువ్వు నా గేమ్ కూడా ఆడి ఇంకా ఎక్కువ ఫైర్‌తో టాప్ 5లో వుండాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
దీనికి ఇనయా స్పందిస్తూ... నీ గేమ్ కూడా కలిపి ఆడతానని మాట ఇచ్చింది. నీ కోసం ఎల్లో మ్యాచింగ్ వేసుకున్నానని చెబుతూ... మైక్ బ్యాగ్‌ను చూపించింది. ఆ బ్యాగ్‌లో ఎల్లో కలర్లో సూర్యుడి ఆకారం ముద్రించి వుంది. అలాగే ఎడమ చేతి ఉంగరం వేలుపైనా సూర్యుడి ఆకారం ప్రింట్ చేసి వుంది. ఇవి చూసి సూర్య ముసి ముసి నవ్వులు నవ్వితే... నాగార్జునకు మాత్రం ఏం అర్ధంకాక అవి ఏంటని ప్రశ్నించాడు. తన గుర్తుగా సార్ అని ఇనయా బదులిచ్చింది. అనంతరం సూర్యకు చేతి వేళ్లతో స్మైలింగ్ సింబల్ పెట్టి వీడ్కోలు చెప్పింది. దీనికి నాగార్జున స్పందిస్తూ.. ఏంటో కొత్తకొత్తవన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరికీ వీడ్కోలు చెప్పిన అనంతరం సూర్య స్టేజ్‌ను వీడాడు.
ఆపై నామినేషన్స్‌లో వున్న పదమూడు మందిని సేఫ్ చేసే ప్రక్రియను ప్రారంభించాడు నాగ్. అలా శ్రీసత్య, రాజ్ , వాసంతి, శ్రీహాన్, కీర్తి, రేవంత్, రోహిత్, గీతూ, ఫైమా, బాలాదిత్య, ఇనయాలను సేఫ్ చేశాడు. చివరికి ఆదిరెడ్డి, గీతూలు మాత్రమే మిగలడంతో మరొకరు ఎలిమినేట్ అవుతారేమోనని హౌస్ మెట్స్ టెన్షన్ పడ్డారు. వీరిద్దరికి కుండ టాస్క్ ఇచ్చిన నాగార్జున.. ఎవరికైతే రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కానీ ఇద్దరికీ గ్రీన్ కలర్ రావడంతో ఇద్దరూ సేఫ్ అవుతారని నాగ్ ప్రకటించారు.
ఇకపోతే.. ఆదివారం నాటి ఎపిసోడ్లో ‘‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’’ హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లాలు సందడి చేశారు. తర్వాత మనిషికో పేరు అనే టాస్క్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని నేమ్ ప్లేట్లను ఇంటి సభ్యులకు డెడికేట్ చేయాలని చెప్పాడు. అలా రచ్చ అనే ట్యాగ్‌ను గీతూకి మెరీనా ఇచ్చింది. అపరిచితుడు అనే ట్యాగ్‌ను శ్రీహాన్‌కి ఇచ్చింది కీర్తి, ఇనయాకు మహానటి అనే ట్యాగ్‌ను ఇచ్చారు శ్రీహాన్. కపటదారి అనే ట్యాగ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయా. శ్వేతనాగు అనే ట్యాగ్‌ను కీర్తికి ఇచ్చింది శ్రీసత్య. వకీల్ సాబ్ అనే ట్యాగ్‌ను బాలాదిత్యకు ఇచ్చింది రేవంత్. దొంగ దొంగ అనే ట్యాగ్‌ను ఆదిరెడ్డికి ఇచ్చింది గీతూ. గీతూకి శత్రువు అనే ట్యాగ్‌ను ఇచ్చాడు రోహిత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com