రెహ్మాన్ ని కదిలించిన శ్రీధర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎ.ఆర్.రెహ్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. సంగీత ప్రియులని తన సంగీతంతో గత పాతికేళ్లుగా మంత్ర ముగ్ధులను చేస్తున్న స్వర మాంత్రికుడు రెహ్మాన్. మణిరత్నం రోజా` సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత వరస సినిమాలతో, ఎన్నో మ్యూజికల్ హిట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. అయితే తన సంగీతంతో ఎంతో మంది మదిని దోచిన రెహ్మాన్‌ని ఏదీ అంత తొందరగా ఆకట్టుకోదని..చివరికి తన సంగీతమైనా తనను ఆకట్టుకునేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడని.. ఆయనతో పనిచేసే సినీ ప్రముఖులు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అటువంటి రెహ్మాన్‌ని ఎవరైనా ఆకట్టుకునేలా చేస్తే? సరిగ్గా ఇలానే చేసి చూపించారు చెన్నైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీధర్. ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా..25 వేర్వేరు సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఉన్న 25 రెహ్మాన్‌ల చిత్రాల్ని చిత్రీకరించి...రెహ్మాన్‌కు ఆయన బహూకరించారు. ఆ చిత్రానికి ముగ్ధుడైన రెహ్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ చిత్రాన్నిపోస్ట్ చేస్తూ...“చెన్నైకి చెందిన చిత్రకారుడు శ్రీధర్ తన ప్రేమతో, గౌరవంతో నన్ను కదిలించారు” అని ట్వీట్ చేసారు. అన్నట్టు.. ఈ రోజు ఈ స్వరమాంత్రికుడు పుట్టినరోజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com