శ్రీదేవి మేనకోడలు,  శివాజీ గణేశన్ మనవడు జంటగా... పద్మిని మనవరాలు తీస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'

  • IndiaGlitz, [Friday,December 10 2021]

పురస్కారాలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ మేకర్... దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇంకా విఘ్నేష్ శివసుబ్రమణియన్, వేస్త చెన్ ఇతర తారాగణం.

కొత్త సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరపరిచిన బాణీతో ఈ మ్యూజిక్ వీడియో రూపొందుతోంది. ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు. సూర్య హీరోగా నటించిన 'బందోబస్తు'కు సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాటకు ఆంటోనీ గొంజాల్వెజ్ ఎడిటర్. ఆయన దర్శకులు శంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకు పని చేశారు.

ఆస్కార్ పురస్కారాల్లో 'లైఫ్ యాక్షన్ షార్ట్' కేటగిరీలో పోటీ పడుతున్న 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది. ఇప్పుడు ఐ ట్యూన్స్, ఆదిత్య మ్యూజిక్ ఛానళ్లలో 'వెన్ ద మ్యూజిక్ చేంజెస్' అందుబాటులో ఉంది.

More News

'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటే..?

ట్రైలర్ లాంచ్ కావడంతో తెలుగు నాట ఆర్ఆర్ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎలా వుండబోతోంది...?

ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 : ‘‘రాజీ’’కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్.. ఫుల్ జోష్‌లో సమంత

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయిన ‘‘ ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2’’ లో టాలీవుడ్ అగ్ర కథానాయిక స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే.

డిసెంబర్ 31న విడుదలవుతున్న రానా దగ్గుబాటి, సత్య శివ, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. '1945'

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు.

ల‌క్ష్య మూవీ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - హీరో నాగ‌శౌర్య‌

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

బిగ్‌బాస్ 5 తెలుగులో రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవుతోంది. అలాగే  టాస్కుల్లో బాగా ఆడిన వారికి ప్రజలను ఓట్లు అడిగే ఛాన్స్  ఇచ్చారు బిగ్‌బాస్.