'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్న శ్రీదేవి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 7న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కాగా, శ్రీదేవి నాలుగు భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతుండడం విశేషం.
నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న శ్రీదేవి 'తునైవన్' అనే తమిళ్ చిత్రంలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో నటించిన శ్రీదేవికి 'మామ్' 300వ చిత్రం. శ్రీదేవి మొదటి చిత్రం విడుదలైన తేదీ జూలై 7, 1967. శ్రీదేవి భర్త, 'మామ్' చిత్ర నిర్మాత బోనీకపూర్ ఈ చిత్రాన్ని శ్రీదేవి తొలి చిత్రం విడుదలైన తేదీ జూలై 7న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
శ్రీదేవికి దేశవ్యాప్తంగా వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, మలయాళంలలో కూడా 'మామ్' చిత్రాన్ని ఒకేరోజున విడుదల చేస్తున్నారు. 'మామ్' శ్రీదేవికి 300వ సినిమా కావడం, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, తన మొదటి సినిమా విడుదలైన రోజునే 'మామ్' చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేయడం...ఇలా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లోనూ తన డబ్బింగ్ చెప్పాలని శ్రీదేవి నిర్ణయించుకున్నారు.
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, ఎడిటింగ్: మోనిసా బల్ద్వా, కథ: రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లి, కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: గిరీష్ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం: రవి ఉద్యవార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments