'బాహుబలి' విషయంలో నేను హార్ట్ అయ్యాను - శ్రీదేవి

  • IndiaGlitz, [Sunday,June 25 2017]

శ్రీదేవి ఎనిమిది కోట్లు రెమ్యున‌రేష‌న్ అడిగారు. హిందీ వెర్ష‌న్‌లో భాగం కావాల‌ని కూడా అడిగారు. షూటింగ్‌కు వ‌స్తే స్టార్ హోటల్ కావాల‌ని, ప‌ది ఫ్లైట్ టికెట్స్ కావాల‌న్నారు...ఇవి బాహుబ‌లిలో శ్రీదేవిని ఎందుకు వ‌ద్ద‌నుకున్నార‌నే దానిపై రాజ‌మౌళిపై ఇచ్చిన స‌మాధానం. అయితే దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రాజ‌మౌళిగారు డైరెక్ట్ చేసిన ఈగ సినిమా చూశాను. నాకు బాగా న‌చ్చింది. బాహుబ‌లి సినిమా కోసం వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు మా మ‌ధ్య క్రియేటివిటీ డిస్క‌ష‌న్స్ మాత్ర‌మే జ‌రిగాయే త‌ప్ప‌, క‌మ‌ర్షియ‌ల్ డిస్క‌ష‌న్స్ జ‌ర‌గ‌లేదు. అయితే నేనేదో నిర్మాత‌ను దోచేయాల‌నుకున్న‌ట్లు, భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌ను ముందు నేను న‌మ్మ‌లేదు. కానీ ఎవ‌రో నాకు యూ ట్యూబ్ లింక్ పంపితే చూసి షాక‌య్యాను.

ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళిగారు మాట్లాడిన విష‌యాలు విని బాధ‌నిపించాయి. నేను అన్ని డిమాండ్స్ చేసేదాన్ని అయితే 50 ఏళ్ళు పాటు ఇండ‌స్ట్రీలో ఉండి, 300 సినిమాలు చేసేదాన్ని కాదు. ఎందుకంటే మా ఆయ‌న ఓ నిర్మాత కాబ‌ట్టి నేను నిర్మాత‌ల క‌ష్టాన్ని అర్థం చేసుకోగ‌ల‌ను. రాజ‌మౌళి నాపై చేసి కామెంట్స్‌కు అప్ సెట్ అయ్యాను. ఓ పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో లేనిది ఉన్న‌ట్లు ఎలా మాట్లాడ‌వ‌చ్చున‌నేది నా అభిప్రాయం. ఒక‌వేళ నిర్మాత‌లు ఆయ‌న‌తో లేనిపోనివి చెప్పినా ఆయ‌న ప‌బ్లిక్ ఫ్లాట్ ఫాంలో ఎలా చెబుతారు. ఒక ఆర్టిస్ట్ గురించి ఏమీ తెలియ‌కుండా అలా మాట్లాడ‌టం స‌రికాదు. నేను ఆర్టిస్ట్‌గా హర్ట్ అయ్యాన‌ని శ్రీదేవి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.