వారం ముందుగా రానున్న శ్రీదేవి 'మామ్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్'. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్'. ఆస్కార్ అవార్డ్స్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారట. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాను ఓ వారం ముందుగానే..అంటే జూలై 7న విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. త్వరలోనే అధికారక సమాచారం వెలువడనుంది. ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com