వర్మను శ్రీదేవి బాధపెట్టింది....
- IndiaGlitz, [Friday,October 02 2015]
దక్షిణాది సినిమా పరిశ్రమలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడే కాదు, ఉత్తరాదిలో కూడా తన సత్తాను చాటింది. బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాల నుండి గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు చాలా సంవత్సరాలు తర్వాత పులి' చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పులి' సినిమాని చూసిన శ్రీదేవి ఫ్యాన్, దర్శకుడు వర్మ కూడా సినిమాపై పెదవి విరిచాడు. బాహుబలి'లో వచ్చిన అవకాశాన్ని కాదని పులి' చిత్రాన్ని శ్రీదేవి ఎందుకు సెలక్ట్ చేసుకుందో తెలియడం లేదని వా పోయాడు. ఓ అభిమానిగా తనకెంతో బాధగా ఉందని ట్వీట్ పెట్టాడు. మరి అభిమానులు బాధ నిజమే కదా...