రీమేక్‌లో శ్రీదేవి త‌న‌య‌...

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

అతిలోక సుంద‌రిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి త‌న‌య జాహ్న‌విక‌పూర్ తెరంగేట్రం గురించి పలు ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. అయితే ఉన్న‌ట్లుండి శ్రీదేవి జాహ్న‌వి న‌టించ‌బోయే సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. షాహిద్ క‌పూర్ త‌న‌యుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ ఇందులో జాహ్న‌వికి జోడిగా న‌టిస్తున్నాడు.

'ద‌ఢ‌ఖ్' పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం మ‌రాఠీ చిత్రం సైర‌త్‌కు రీమేక్‌గా రూపొందుతోంద‌ట‌. శశాంక్‌ ఖైతాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌లో జాహ్న‌విని చూసిన వారంద‌రూ అచ్చం శ్రీదేవిని చిన్న‌ప్పుడు చూసిన‌ట్టుంద‌ని అంటున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జూలై 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.