జనతా గ్యారేజ్ లో జాహ్నవి..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

జ‌న‌తా గ్యారేజ్..ఎన్టీఆర్ న‌టిస్తున్న న్యూమూవీ టైటిల్ అని తెలుసు. మ‌రి జాహ్న‌వి ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఇంకెవ‌రు...అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె పేరే జాహ్న‌వి. ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించ‌నున్న జ‌న‌తా గ్యారేజ్ మూవీలో హీరోయిన్ గా రోజుకో పేరు వినిపిస్తోంది. శ్రుతి హాస‌న్, అమైరా ద‌స్తూర్, పరిణీతి చోప్రా...పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఎన్టీఆర్ స‌ర‌స‌న శ్రీదేవి కుమార్తె జాహ్న‌వి పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ తో జాహ్న‌వి న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం గురించి శ్రీదేవిని అడిగితే..ప్ర‌స్తుతం జాహ్న‌వి చ‌దువుకుంటుంది. అప్పుడే సినిమాలు ఏమిటి..? ప్ర‌స్తుతం త‌న ఆలోచ‌న అంతా చ‌దువుపైనే అంది. మ‌రి..ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే కూడా ఇదే స‌మాధానం చెబుతుందా..? లేక ఆలోచిస్తుందో..?

More News

అనుష్క గురించి ఆర్య కామెంట్

అందం, అభిన‌యం...ఈ రెండింటికి మ‌రో పేరు అనుష్క‌. అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి సౌతిండియా స్టార్ హీరోయిన్ గా బాగా పాపుల‌ర్ అయిన అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం సైజ్ జీరో.

కోనా..ఇది నిజమా..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించి బ్రూస్ లీ చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై...ఆశించిన స్ధాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే.

మొత్తానికి న‌య‌న‌తార సినిమా వ‌స్తోంది

'వ‌ల్ల‌భ' వంటి వివాద‌స్ప‌ద చిత్రం త‌రువాత శింబు, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు'.

'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు.

శ్రుతి హాస‌న్‌ని డామినేట్ చేసేలా..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాస‌న్‌. ఈ దీపావ‌ళికి అజిత్‌తో న‌టించిన త‌మిళ చిత్రం 'వేదాళ‌మ్'తో త‌న మాతృభాష ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది శ్రుతి.