టాలీవుడ్ పరిశ్రమ శ్రీదేవి కి సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభ
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. ఆదివారం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శ్రీదేవి మళ్లీ శ్రీదేవిగానే పుట్టాలి` అని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్, సి.కల్యాణ్, పి.సుశీల, నివేదాథామస్, బి.వి.ఎస్,ఎన్.ప్రసాద్, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలయగానే నాతో పాటు యావత్ భారతదేశం షాక్ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్ బీయింగ్. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు. అందరూ అనుకుంటున్నట్టు శ్రీదేవికి ఆర్థిక సమస్యలేం లేవు. శ్రీదేవి కెరీర్‌లో పుంజుకుంటున్న దశలోనే ఆమె మాతృమూర్తి చెన్నైలో స్థలాలు కొన్నారు. ఈ స్థలాలు అమ్మేసి.. హైదరాబాద్‌లో ఏమైనా కొనాలా` అని నన్ను శ్రీదేవి చాలాసార్లు సలహా అడిగేది. హిందీలో ఆమెతో రెండు చిత్రాలు నిర్మించా. అవి రెండూ బాగా ఆడాయి``
కృష్ణంరాజు మాట్లాడుతూ - ''సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్ అడ్జస్ట్ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
శ్రీదేవి నన్నెప్పుడూ సర్` అని పిలిచేది. పెద్దలంటే ఆమెకు చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా` అంది. బొబ్బిలి బ్రహ్మన్న` హిందీలో తీశాం. అందులో కథా నాయికగా శ్రీదేవి నటించింది. నేను ఫోన్ చేయగానే ఒప్పుకొంది. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ బాగా సహకరించింది``
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో 'అనురాగదేవత' సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
మన కళ్ల ముందు నుంచి శ్రీదేవి వెళ్లిపోవడం అన్యాయం. అనురాగ దేవత` షూటింగ్ రవీంద్ర భారతిలో జరుగుతోంటే మేం వెళ్లాం. చూసుకో పదిలంగా` అనే పాట.. ప్రేక్షకుల్లో కూర్చుని చూశాం. అదో జ్ఞాపకం. రామానాయుడు దేవత` చేశారు. ఎన్టీఆర్ అనురాగ దేవత` చేశారు. అలాంటి దేవత.. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం``
జయప్రద మాట్లాడుతూ - ''ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది. తనతో పదిహేను సినిమాలు చేసుంటా. పోటా పోటీగా నటించేవాళ్లం. మామధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అందం, నాట్యం, డైలాగ్.. ఇలా అన్నింట్లోనూ పోటీ ఉండేది. శ్రీదేవి అవ్వాలన్న కోరికతో చాలామంది ఈ పరిశ్రమలోకి వచ్చారు. అతిలోక సుందరి తెలియని లోకాలకు వెళ్లిపోయింది. మంచి తల్లిగా తన బిడ్డల్ని తీర్చిదిద్దాలన్న తపన ఉండేది
అమల అక్కినేని మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు బ్యూటీఫుల్, ఫాబులస్ ఆర్టిస్ట్. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
పి.సుశీల మాట్లాడుతూ - ''దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అన్నారు. దేవలోకంలోంచి వచ్చిన సుందరిలా మన కళ్ల మందు కదిలి.. మళ్లీ తన లోకానికి వెళ్లిపోయింది. తన ఎనిమిదేళ్ల వయసులో తనకు నేను ఓ పాట పాడినందుకు గర్విస్తున్నాను. హీరోయిన్‌గా తొలి సినిమాలోనూ నేనే పాట పాడాను. అది భగవంతుడు నాకిచ్చిన అవకాశం`
జగపతిబాబు మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు అమర్ రహే. ఆమె కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
జయసుధ మాట్లాడుతూ - ''శ్రీదేవి మనకు దూరం కావడాన్ని ఆమెతో నటించిన సహనటిగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. చైల్డ్ సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆమె మనసుకు శాంతి కలగాలి. ఆమె ఇద్దరి అమ్మాయిలు గొప్ప హీరోయన్స్‌గా పేరు తెచ్చుకుని, వారి తల్లి కోరికను తీరుస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. నేనూ, శ్రీదేవి పది చిత్రాల వరకూ నటించాం. బాల నటిగా ఉన్నప్పుడు.. తనని చూడ్డానికి ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లా. అలా నేను చూసిన మొదటి నటి ఆమె. మా అమ్మగారు, శ్రీదేవి అమ్మగారు మంచి స్నేహితులు. చెల్లాయి సుభాషిణితో కూడా సాన్నిహిత్యం ఉండేది. నన్నెప్పుడూ జయసుధగారూ` అనే పిలిచేది. శ్రీదేవి ప్రతి పుట్టిన రోజుకీ చెన్నై తప్పకుండా వెళ్లేదాన్ని. శ్రీదేవి మరణవార్త కలచివేసింది. నాకేదో అయిపోతోందన్న భయం వచ్చేసింది. ముంబైకి కూడా వెళ్లి చూడాలనిపించలేదు. కనీసం టీవీ కూడా చూడలేదు. చివరి సారి తన మొహం చూడాలనుకుని కేవలం ఇరవై సెకన్ల పాటు టీవీ ఆన్ చేశా. ఆమె పార్థివ దేహం చూస్తుంటే చిన్నప్పటి శ్రీదేవిలా కనిపించింది
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారు చిరస్థాయిగా మన మనస్సుల్లోనే ఉన్నారు. నటిగా ఆమె ఏ రోజు ఏ నిర్మాతను, దర్శకుడిని నొప్పించలేదు. కానీ ఈ ఏడాది మన అందరినీ నొప్పించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బోనీ, జాన్వీ, ఖుషీలు సహా అందరికీ ఆ దేవుడు ఆత్మ స్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ - ''శ్రీదేవిగారి మరణవార్త విని చాలా షాక్‌కు గురయ్యాం. ఆమె తండ్రి ఆయ్యప్పన్‌గారితో మా నాన్నకు మంచి అనుబంధం ఉండేది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమె ప్రతి భారతీయుడి కుటుంబంలో భాగమైన నటి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ - ''నేను శ్రీదేవిగారితో కలిసి రెండు, మూడు సినిమాల్లో పనిచేశాను. ఆ దేవుడు నటిగా పుట్టించాడు. ఆమె యాబై ఏళ్లు నటించింది. మళ్లీ దేవుడు దగ్గరికే వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``జగదేకవీరుడు అతిలోక సుందరి` సహా మరో చిరంజీవి సినిమాలో శ్రీదేవిగారు చిరంజీవిగారితో కలిసి నటించారు. నాకు స్నేహితుడైన బోనీ కపూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న కొత్తలో వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆమె ఇల్లాలిగా చేసిన గౌరవం చూసి నేను స్థానువైయ్యాను. ఎందుకంటే ఆమె మన దృష్టిలో ఉన్న స్థాయి వేరు కాబట్టి. నేను మనసులో ఏడ్చానని అప్పుడు అశ్వనీదత్‌గారితో చెప్పాను. ఆమెను మరచిపోలేం. రామ్‌గోపాల్ వర్మ రాసిన లేఖ ఒకటి ఈ మధ్య చదివాను. అది చదివిన తర్వాత తను మనసు ఎంత మెత్తనైనది. ఆమె గురించి వర్మ ఎంత స్టడీ చేశాడోనని నాకు అర్థమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత.. బోనీ కుంటుంబం వారిని దూరం చేసింది. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆ కుటుంబం దగ్గర కావాలని.. అవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు. ఓసారి బోనీకపూర్ ఇంటికివెళ్లా. ఓకుర్రాడు టీ తీసుకొచ్చాడు. శ్రీదేవి ఆ కప్పు తీసుకుని నా చేతుల్లో పెడుతుంటే.. ఆశ్చర్యపోయా. నా మనసులో ఆవిడకున్న స్థాయివేరు. ఆమె కప్పు అందించడం ఒప్పుకోలేకపోయా. ఈ విషయం నాతో పాటు వచ్చిన అశ్వనీదత్‌కు చెప్పుకుంటూ కుమిలిపోయా. శ్రీదేవి మరణం తరవాత రాంగోపాల్ వర్మ రాసిన ఉత్తరం చదివా. వర్మ గురించి రకరకాలుగా అనుకుంటాం. కానీ వర్మ హృదయం ఎంత మెత్తనైందో తొలిసారి తెలిసింది``
ఈ కార్యక్రమంలో జగపతిబాబు, అమల, జీవిత, రాజశేఖర్, పింకి రెడ్డి, ఉపాసన, శోభనా రెడ్డి, సుమంత్, కోట శ్రీనివాసరావు, నరేష్, శివాజీరాజా, అలీ, కవిత, రేలంగి నరసింహారావు, బాబూ మోహన్ తదితరులు పాల్గొన్నారు.-- కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీదేవికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com