'మామ్' తో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న శ్రీదేవి

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌స‌. ఈ చిత్రం జూలై 7న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సినీ చ‌ల‌న చిత్ర సీమ‌లోకి బాల‌న‌టిగా అడుగుపెట్టిన శ్రీదేవి న‌టిగా మామ్ చిత్రంతో 50 ఏళ్ళ‌ను పూర్తి చేసుకుంది. ఈ మామ్ చిత్రం శ్రీదేవి 300వ చిత్రం కావ‌డం విశేషం.

ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిన కూడా స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి న‌టించిన మామ్ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ భాష‌ల‌న్నింటిలో శ్రీదేవి త‌న పాత్ర‌కు త‌న డ‌బ్బింగ్ చెప్పుకోనుండ‌టం విశేషం. శ్రీదేవి డెబ్యూ మూవీ 1967 జూలై 7న విడుదలైంది. శ్రీదేవి 50 ఏళ్ళ న‌ట ప్ర‌స్థానం మామ్ చిత్రంతో పూర్తి కావ‌డంతో . చిత్ర నిర్మాత‌, శ్రీదేవి భ‌ర్త అయిన బోనీక‌పూర్ మామ్ చిత్రాన్ని జూలై 7న విడుద‌ల చేస్తున్నారు.

More News

ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట...

ఇప్పటి తరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పరంగా ఏదైనా ఒకసారి చూస్తే పట్టేస్తాడని అతనితో పనిచేసిన దర్శకులు అంటుంటారు. ఇప్పుడు జై లవకుశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

సూర్య సహా ఏడుగురు నటులపై నాన్ బెయిలబుల్ వారెంట్...

తమిళ స్టార్ హీర సూర్య సహా శరత్కుమార్, చేరన్, విజయ్కుమార్, సత్యరాజ్, అరుణ్ విజయ్, వివేక్, శ్రీప్రియలపై ఊటీ, నీలగిరి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది.

మావయ్య దర్శకుడితో మేనల్లుడు..

పవర్స్టార్ పవన్కళ్యాణ్కు తొలిప్రేమ చిత్రంతో సూపర్స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత ఖుషీ వరకు పవన్ కల్యాణ్ సినిమా విజయాలకు తిరుగే లేకుండా పోయింది. ఆ సినిమాను చేసిన కరుణాకరన్ తో ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ జతకట్టనున్నాడని సమాచారం.

నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం కొత్తగా ఉంది - వెన్నెల కిషోర్

ఇప్పటి వరకు కామెడి పాత్రలతో మెప్పించిన వెన్నెలకిషోర్ ఇప్పుడు అమీ తుమీ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనపడబోతున్నాడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెన్నెలకిషోర్ సినిమా విశేషాలను తెలియజేశారు.

మహిళలకు క్షమాపణలు తెలిపిన 'మా'

ఇటీవల ఓ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను కించ పరిచి మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపాయో తేలిసిందే. అనంతరం ఆయన మహిలలకు క్షమాపణలు కూడా తెలిపారు.