'మామ్' తో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న శ్రీదేవి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌స. ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమైంది. సినీ చలన చిత్ర సీమలోకి బాలనటిగా అడుగుపెట్టిన శ్రీదేవి నటిగా మామ్ చిత్రంతో 50 ఏళ్ళను పూర్తి చేసుకుంది. ఈ మామ్ చిత్రం శ్రీదేవి 300వ చిత్రం కావడం విశేషం.
దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి నటించిన మామ్ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ భాషలన్నింటిలో శ్రీదేవి తన పాత్రకు తన డబ్బింగ్ చెప్పుకోనుండటం విశేషం. శ్రీదేవి డెబ్యూ మూవీ 1967 జూలై 7న విడుదలైంది. శ్రీదేవి 50 ఏళ్ళ నట ప్రస్థానం మామ్ చిత్రంతో పూర్తి కావడంతో . చిత్ర నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీకపూర్ మామ్ చిత్రాన్ని జూలై 7న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com