కొత్త ట్రెండ్ కి శ్రీ శ్రీ శ్రీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ తెరకెక్కించిన చిత్రం శ్రీ శ్రీ. ఈ చిత్రాన్ని ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయనున్నారు. అదే రోజున శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...తెలుగు వారందరికీ వినోద సాధనం సినిమా. 50 ఏళ్ల క్రితం తేనె మనసులు అనే ఈస్ట్ మన్ కలర్ చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయ్యాను. గూడచారి 117, అల్లూరి సీతారామరాజు, సింహాసనం...ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాను. శ్రీ శ్రీ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేస్తున్నాం. అదే రోజున విదేశాల్లో శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నాం అన్నారు.
విజయనిర్మల మాట్లాడుతూ...ముప్పలనేని శివ కథ చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. సెంటిమెంట్ డ్రామాతో ఉన్న ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్ని జన్మల బంధమో...అనే పాట ఉంది. ఆ పాట మా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది అన్నారు.
డైరెక్టర్ ముప్పలనేని శివ మాట్లాడుతూ...పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యాను. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com