సూపర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ కృష్ణ నటించిన తాజా చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని ముప్పలనేని శివ తెరకెక్కించారు. ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఓ విశేషం అయితే... విజయనిర్మల, సీనియర్ నరేష్ ముఖ్యపాత్రలు పోషించడం మరో విశేషం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31. ఈ సందర్భంగా పుట్టినరోజు కానుకగా జూన్ 3న శ్రీశ్రీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ...అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్రం కథాంశం. మహాకవి శ్రీశ్రీగారు తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే.... మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. కృష్ణగారు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో శ్రీ శ్రీ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com