close
Choose your channels

శ్రీ శ్రీ నా కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుంది - సూపర్ స్టార్ కృష్ణ

Thursday, February 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
తేనె మ‌న‌సులు (1965) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే స‌క్సెస్ సాధించి ఆత‌ర్వాత తెలుగు తెర‌పై ఎన్నో ప్ర‌యోగాలు చేసిన క‌థానాయ‌కుడు సూప‌ర్ స్టార్ కృష్ణ‌. యాభై ఏళ్ల సుదీర్ఘ న‌ట‌ప్ర‌స్ధానంలో దాదాపు 350 చిత్రాల్లో న‌టించారాయ‌న‌. న‌టుడుగా యాభై ఏళ్లు పూరైనా...త‌న‌యుడు మ‌హేష్ బాబు సూప‌ర్ స్టార్ గా ఎదిగినా...ఇంకా న‌టించ‌డానికి రెడీ అంటూ శ్రీ శ్రీ సినిమాలో న‌టించారు సూప‌ర్ స్టార్. ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీ శ్రీ సినిమాలో విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ శ్రీ శ్రీ ఆడియో వేడుక‌, కృష్ణ గారి స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌ను అభిమానులు, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.
ఆ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ బాబు అతిధిగా హాజ‌రై శ్రీ శ్రీ ఆడియో బిగ్ సిడిను రిలీజ్ చేసారు. అలాగే మా స్టార్స్ యాప్ ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాంఛ్ చేసారు. అనంత‌రం శ్రీ శ్రీ థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ ను లాంఛ్ చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్, శివాజీరాజా కృష్ణ గార్ని శాలువాతో స‌త్క‌రించి స‌న్మాన ప‌త్రాన్ని మ‌హేష్ ద్వారా అంద‌చేసారు. అలాగే కృష్ణంరాజు దంప‌తులు కృష్ణ దంప‌తులుకు 50 ఇయ‌ర్స్ షీల్డ్ అంద‌చేసారు.
ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ...సూప‌ర్ స్టార్ కృష్ణ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయ‌నకి త‌మ్ముడుగా ఓ సీరియల్ లో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
యువ హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ...నాకు అల్లూరి సీతారామ‌రాజు సినిమా ఎంత‌గానో స్పూర్తినిచ్చింది. శ్రీ శ్రీ సినిమాలో నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను అని రాస్తున్నారు. ఆ న్యూస్ చ‌దువుతుంటే కృష్ణ గారి సినిమాలో నేను గెస్ట్ రోల్ చేయ‌డం ఏమిటి అనిపించింది. ఈ సినిమాలో నాకు జూనియ‌ర్ ఆర్టిస్ట్ గా ఓ చిన్న రోల్ దొరికింది. చిన్న రోల్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ప‌ది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత‌ కృష్ణ గార్కి ఇది ప‌ర్ ఫెక్ట్ సినిమా. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి ద‌ర్శ‌న్ పరిచ‌యం అవుతుండ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
డైరెక్ట‌ర్ కోదండ‌రామిరెడ్డి మాట్లాడుతూ...కృష్ణ గారితో ఓ ప‌ది సినిమాలు చేసాను. మా ఇద్ద‌రి ప్ర‌యాణం స‌క్సెస్ ఫుల్ గా సాగింది. కృష్ణ గారు నిర్మాత‌ల మ‌నిషి. నిర్మాతల‌కు అండ‌గా నిలిచే ఏకైక హీరో కృష్ణ గారు. మా అబ్బాయి వైభ‌వ సినిమా బాగుంద‌ని చెప్పిన మొద‌టి వ్య‌క్తి కృష్ణ గారు. శ్రీ శ్రీ సినిమాలో ఆయ‌న గెట‌ప్ చాలా బాగుంది అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ... నా ఫ‌స్ట్ మూవీ కృష్ణ గారితోనే చేసాను. ఆయ‌న అప్పుడు ఎలా ఉన్నారో ఇప్ప‌డూ అలాగే ఉన్నారు. శ్రీ శ్రీ మంచి విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ...ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సినిమా చ‌రిత్ర‌లో ఉత్త‌మ‌మైన మ‌న‌షి అంటే సూప‌ర్ స్టార్ కృష్ణ‌. అంద‌రూ న‌న్ను రెబ‌ల్ స్టార్ అంటారు కానీ నేను కాదు రెబ‌ల్ స్టార్ కృష్ణే రెబ‌ల్ స్టార్. అల్లూరి సీతారామ‌రాజు తీసి తెలుగు సినిమా స‌త్తా ఏమిటో చూపించారు. ఫ‌స్ట కౌబాయ్ సినిమా ఫ‌స్ట్ క‌ల‌ర్ సినిమా తీసి చూపించాడు. ఆయ‌న‌తో నాకు ఉన్న అనుబంధం ఎంతో మాట‌ల్లో చెప్ప‌లేను. కృష్ణ గారి ఆఖ‌రి అమ్మాయిని ద‌త‌త్త తీసుకుంటాను అన్నాను. ఆయ‌న అలాగే అన్నారు. మా ఇద్ద‌రి మ‌న‌సులు ఒక‌టే. ఒకే కుటుంబం. కృష్ణ మా ఇంటికి వ‌స్తున్నాడంటే ఎంతో హుషారు. ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెన‌క ఓ స్ర్తీ ఉంటుంది అదే మా విజ‌య‌నిర్మ‌ల‌. నేను కూడా కొన్ని నెల‌ల్లో 50 పూర్తి చేయ‌బోతున్నాను. ఇప్పుడు శ్రీ శ్రీ సినిమా చేయ‌డం చూస్తుంటే కృష్ణ‌లో హుషారు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కృష్ణ నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటున్నాను. ఇదే మిత్రుడుగా నా ఆశీర్వాదం. కృష్ణ ప్రొడ్యూస‌ర్స్ కే కాదు ఇండ‌స్ట్రీకే ఎంతో హెల్ప్ చేసారు అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు మూర్తి మాట్లాడుతూ...కృష్ణ గారికి విజ‌య‌నిర్మ‌ల గార్కి పెద్ద అభిమానిని. అటువంటిది కృష్ణ గారి సినిమాకి సంగీతం అందిస్తాన‌ని అనుకోలేదు. కృష్ణ గారు నిన్న సూప‌ర్ స్టారే... నేడు సూప‌ర్ స్టారే.. రేపు సూప‌ర్ స్టారే..అన్నారు.
నిర్మాత సాయిదీప్ మాట్లాడుతూ...ముప్ప‌ల‌నేని గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయ‌న మంచి క‌థ‌తో ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. శ్రీ శ్రీ ఫ్యామిలీని, యూత్ ని ఆక‌ట్టుకుంది అన్నారు.
ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ... సామాన్యుడు ఎదుట అన్యాయం జ‌రిగితే ఎదురుతిరిగే ప్ర‌తివాడు శ్రీ శ్రీ. ఈ సినిమా మంచి విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
న‌రేష్ మాట్లాడుతూ...మ‌రాఠీ సినిమా రైట్స్ తీసుకుని ఈ సినిమా చేసాం. ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంది. డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు డైరెక్ట‌ర్ ముప్ప‌ల‌నేనికి చెప్పాను ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని. మా ఫ్యామిలీ అంతా క‌ల‌సి శ్రీ శ్రీ చేయ‌డం ఆనందంగా ఉంది అన్నారు.
ద‌ర్శ‌కురాలు, సీనియ‌ర్ న‌టి విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ...శ్రీ శ్రీ సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది కృష్ణ గారితో చేసిన 48వ సినిమా. మ‌రాఠీ కంటే బాగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. శ్రీ శ్రీ అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.
సూప‌ర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...నేను న‌టించ‌డం ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తవ్వ‌డం స్వ‌ర్ణోత్సం జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంది. ఈ సంద‌ర్భంగా న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేసిన ఆదుర్తి సుబ్బారావు గార్కి, ఎంత‌గానో ప్రొత్స‌హించిన డూండీ గార్కి థ్యాంక్ తెలియ‌చేస్తున్నాను. నేను ఐదారేళ్ల‌గా సినిమా చేయ‌లేదు. ముప్ప‌ల‌నేని శివ ఈ సినిమా క‌థ చెప్పాడు. విన్న వెంట‌నే నాకు బాగా న‌చ్చింది. మ‌రాఠీ సినిమా కంటే 100 రెట్లు బాగా తీసాడు. శ్రీ శ్రీ నా కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు.
ప్రిన్స్ మ‌హేష్ మాట్లాడుతూ....నాలుగైదు నెల‌ల క్రితం ఈ సినిమాలో నాన్న‌గారి గెట‌ప్ చూసాను. ఒక్క‌సారిగా చిన్న‌ప్ప‌టి రోజులు గుర్తుకు వ‌చ్చాయి. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా చేస్తానా అనిపించింది. ఎప్పుడూ నా సినిమా ఫంక్ష‌న్ కి నాన్న‌గారు వ‌చ్చేవారు. ఇప్పుడు నాన్న‌గారి సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి నేను రావ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment