శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్ పూర్తి
Wednesday, November 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్టైనర్ని చూడలేదని, సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వసంత్ ఈచిత్రానికి సూపర్‌హిట్ మ్యూజిక్‌ని ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్లోనే ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments