శ్రీ సత్య దేవ క్రియెషన్స్ నూతన చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమతి సువర్ణ రత్న కుమారి సమర్పణ లో బి.సుబ్రమణ్యం నిర్మాత గా పి. వెంకటేశ్ దర్శకత్వం లో అనిల్ కళ్యాణ్. రూపా జంటగా రూపొందుతున్న నూతన చిత్రం ద్వారకా తిరుమల దైవ సన్నిధిలో ప్రారంభం అయింది. సంగీత ప్రదానంగా సాగే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సాగర్ మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు. పారిశ్రామిక వేత్త ఎ. అనిల్ కెమెరా స్విచ్ ఆన్ చెసారు. వి.బి.కృష్ణ మూర్తి క్లాప్ కొట్టి సినిమా ను ప్రారంభించారు.
దర్శకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. సంగీతమె ప్రదానంగా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబరు 5.నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభ0 అవుతుంది. సినిమా మొత్తం ఈస్ట్. వెస్ట్ లొ షూటింగ్ జరుపుతాం..మా చిత్రాన్ని ఆశీర్వదించడం కోసం ఇంత దూరం వచ్చిన సాగర్ గారికి కృతజ్ఞతలు. అన్నారు. హీరో అనిల్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇధి స్వచ్చమైన తెలుగు సినిమా. మంచి కధ తొ మీ ముందుకు రావటం చాల సంతోషం గా ఉంది. దర్శక .నిర్మాతలకు కృతజ్ఞతలు. అన్నారు.
నిర్మాత సుబ్రమణ్యం మాట్లాడుతూ.. వెంకటేశ్ నాకు చాల కాలం నుండి తెలుసు. తను చెప్పిన కధ బాగుంది..ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా మొదలు పెట్టడం జరిగింది. షూటింగు మొత్తం గోదావరి జిల్లా లలో ఉంటుంది. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది. .అన్నారు.
హీరో అనిల్ కళ్యాణ్. రూపా. జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో. తనికెల్ల భరణి.ప్రభు. ఆనంద్. సితార. కృష్ణ భగవాన్.రావు రమేశ్. ఇతర తారగణం. ఈ చిత్రానికి కెమెరా: N.సుధాకర రెడ్డి. సంగీతం: మణి శర్మ. పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి .ఎడిటింగ్: గౌతం రాజు. కొ.ప్రొడ్యూసర్లు: దివి నాగ మల్లేశ్వర రావు. Ch: ప్రసాద్ రెడ్డి. ప్రొడ్యూసర్: B.సుబ్రమణ్యం. దర్శకత్వం: P. వెంకటేశ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Liya Harini
Contact at support@indiaglitz.com