నేను గెలిచాను.. థ్యాంక్యూ కేసీఆర్ గారు..: శ్రీరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ‘కాస్టింగ్ కౌచ్’పై నటి శ్రీరెడ్డి చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 984 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యింది. ఫేస్బుక్ వేదికగా శ్రీరెడ్డి తెలంగాణ సర్కార్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ చేసింది.
శ్రీ రెడ్డి ఫేస్బుక్ పోస్ట్ యథావిథిగా...
" ఒక హైదరాబాదీగా నేను ఇవాళ గర్వపడుతున్నాను. థ్యాంక్యూ సో మచ్ రియల్ హీరో కేసీఆర్ గారు. నా కల ఇప్పటికి సాకారమైంది. నా పోరాటం ఫలించింది.. నేను గెలిచాను. ఇప్పుడు ప్రపంచానికే హీరోయిన్ అయినంత సంతోషంగా ఉంది. నేను ఫిల్మ్ చాంబర్ ఎదుట చేసిన అర్ధనగ్న నిరసనకు ప్రభుత్వం స్పందించడం విశేషం. నేను చేసి ఉద్యమంలో సాయపడిన నటి అపూర్వ సహా మిగతా మిత్రులు, స్నేహితుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని శ్రీ శక్తి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్‌కు కేసీఆర్ ఫొటోను ఆమె జత చేసింది. ఈ పోస్ట్‌పై అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రెడిట్ మొత్తం మీకే శ్రీరెడ్డి.. ఎంజాయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఇకపై నటీమణులను లైంగికంగా వేధిస్తే తాట తీస్తారన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com