శ్రీరెడ్డి సక్సెస్.. ‘క్యాస్టింగ్ కౌచ్‌’‌‌పై కమిటీ ఏర్పాటు

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

టాలీవుడ్‌లో జరుగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్‌’ నటి శ్రీరెడ్డి ఉద్యమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం అన్ని సినీ ఇండస్ట్రీలకు తెలియడం.. జాతీయ మీడియా సైతం ఈ వార్తలను కవర్ చేయడం జరిగింది. అంతేకాదు ఆఖరికి తనకు న్యాయం చేయాలంటూ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీ శక్తి చేసిన ఈ పోరాటానికి పలువురు నటీనటులు, ప్రముఖులు సైతం అండగా నిలిచారు. అంతేకాదు గతంలో వివిధ మహిళా సంఘాలు కూడా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కమిటీలో ఉన్న మహిళలు ఎవరు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఇక కఠిన చర్యలు తీసుకొని బాధితులకు అండగా నిలవాలని సర్కార్ భావించింది. ఇందుకుగాను టాలీవుడ్‌లో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఫ్యానల్‌లో సభ్యులు పేర్లతో సహా ఉత్తర్వుల్లో చెబుతూ బుధవారం రోజున ప్రకటన చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 984 ప్రకారం.. నటి సుప్రియ, సినీనటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో ప్రతినిధులుగా నియమించడం జరిగింది. అంతేకాదు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మికి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది.

పురుషులు కూడా..!

ఇదిలా ఉంటే.. ఈ కమిటీలో కేవలం మహిళలకే కాకుండా పురుషులకు చోటు కల్పించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక నిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ ప్రకటించింది. సో.. ఇకపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న మాట. కాస్త ఆలస్యమైనా సర్కార్ మాత్రం మంచి నిర్ణయం తీసుకుందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. తెలంగాణ సర్కార్ నియమించిన ఈ కమిటీపై ఇంత వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరూ స్పందించలేదు. అంతేకాదు దీనిపై పోరాటం చేసిన శ్రీరెడ్డి కూడా ఇంత వరకూ స్పందించలేదు. అయితే ఆమె స్పందిస్తే ఈ కమిటీ సభ్యులపై ఏమేం కామెంట్స్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

పీఎన్‌బీలో ప్రకంపనలు.. ఖాతాల్లో లక్షలు మాయం

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయాల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

గుడ్ న్యూస్: స్టాండ్ బై జాబితాలో రిషబ్, రాయుడు

వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బుధవారం నాడు బీసీసీఐ శుభవార్త చెప్పింది.

జెట్ ఎయిర్‌వేస్ కీలక నిర్ణయం.. అర్ధరాత్రి నుంచి బంద్

అప్పుల్లో కూరుకుపోయిన  ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

నాగ్‌ను టార్గెట్ చేసిన రాములమ్మ.. అసలేం జరుగుతోంది!?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

‘టిక్‌టాక్’ తర్వాత పబ్‌జీ పై నిషేధం..!

'టిక్‌టాక్‌' యాప్‌పై విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ యాప్‌ సంబంధీకులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు.