పోలీస్ కస్టడీలో శ్రీ రెడ్డి...
Send us your feedback to audioarticles@vaarta.com
కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి టాలీవుడ్లో దుమారాన్ని రేపిన నటి శ్రీరెడ్డి.. రోజుకో సంచలనానికి తెర తీస్తుంది. కాస్టింగ్ కౌచ్‌పై ఆరోపణలు చేసిన కొన్ని రోజుల వరకు అన్ని ఛానెల్స్ పోటీ పడి ఆమెను ఇంటర్వ్యూలు చేశాయి.
కొన్నిరోజులకు తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వారి బండారం బయట పెడతానని చెప్పింది. ముందు దర్శకుడు శేఖర్ కమ్ముల.. హీరో నానిపై విమర్శలు గుప్పించింది. వీరికి అమ్మాయిల పిచ్చి ఉందని ఆరోపణలు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే తాను నగ్నంగా ధర్నా చేస్తానని రెండు రోజుల ముందు ప్రకటించింది. అన్నట్లుగానే ఈరోజు ఛాంబర్‌కి వచ్చి తనకు మా అసోసియేషన్‌లో సభ్యత్వం కావాలని.. అవకాశాలు కావాలని అడిగింది.
వారి వైపు సరైన సమాధానం లేకపోవడంతో అర్ధనగ్నంగా ఛాంబర్ దగ్గరే కూర్చుంది. దీంతో అన్ని ఛానెల్స్ శ్రీరెడ్డి పై మరోసారి ఫోకస్ పెట్టాయి. త్వరలో ఆమరణ దీక్ష కూడా చేస్తానని ఈమె చెప్పడం గమనార్హం. ఈమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout