బాలయ్య బర్త్ డే.. మెగా ఫ్యామిలీపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అ్రగనటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు వారి వారి ఇళ్లలోనే కేక్‌లు కట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి విషెస్ చెప్పింది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. మెగా హీరోలపై ఈ సందర్భంగా హాట్ హాట్ కామెంట్స్ చేసింది.
శ్రీరెడ్డి ట్వీట్ సారాంశం ఇదీ..
‘ఇండస్ట్రీ సింహ స్వప్న, నట రత్న, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మంచి వ్యక్తి. ఆయనకు పద్మశ్రీలు అవసరం లేదు.. ఆయన నవ్వే పెద్ద పద్మశ్రీ లాంటి అవార్డ్. మీరు ప్రేమతో చెంపమీద కొడతావ్ తప్ప.. మెగా ఫ్యామిలీ లాగ కుడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం గురించి ఆలోచించే ముద్దుల మామయ్య మా బాలయ్య. లెజెండరీ యాక్టర్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని బాలయ్యకు విష్ చేస్తూ.. మెగా ఫ్యామిలీపై హాట్ హాట్ కామెంట్స్ చేసింది. కాగా ఈ కామెంట్స్ బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగి తేలుతుండగా.. మెగాభిమానులు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తానికి చూస్తే బాలయ్య పుట్టిన రోజునే మరో వివాదానికి శ్రీరెడ్డి తెరలేపిందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com