అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'రంగులరాట్నం' చేయడం చాలా సంతోషంగా ఉంది - శ్రీరంజని, చిత్రా శుక్లా
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రంగులరాట్నం'. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్. శ్రీరంజని దర్శకురాలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...దర్శకురాలు శ్రీరంజని మాట్లాడుతూ - ''రంగులరాట్నం ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా తొలి సినిమా ఇది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌వంటి పెద్ద బ్యానర్ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. నేను సెల్వరాఘవన్‌గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆయన వద్ద 9 ఏళ్లు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇక సినిమా గురించి చెప్పాలంటే స్వీట్, క్యూట్ లవ్‌స్టోరీ. సాధారణంగా ప్రేమకథల్లో చిన్నపాటి సంఘర్ణణలుంటాయి. అలాంటి సంఘర్ణణే ఈ సినిమాలో కూడా ఉంటుంది. అది తెరపై చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది.
నేను తమిళ హీరోలకు కూడా ఈ కథను వినిపించాను. అందరికీ నచ్చింది కానీ..వెయిట్ చేయమని చెప్పారు. కొన్ని నెలలు వెయిట్ చేశాను. ఆ సమయంలో తెలుగులో ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడు సినిమాటోగ్రాఫర్ మదిగారు స్క్రిప్ట్‌ను ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్‌గారికి వినిపించమని అన్నారు. స్క్రిప్ట్ విన్న రాజీవన్‌గారు..కథ బావుంది. అన్నపూర్ణ స్టూడియో యూనిట్‌కు చెప్పమని చెప్పారు. నేను సుప్రియగారిని కలిశాను. నేను నెరేట్ చేసిన విధానం నచ్చడంతో..ఆవిడ నాగార్జునగారికి కథను వినిపించమని చెప్పారు. కథ విన్న నాగార్జునగారు..బావుందని చెప్పడంతో సినిమా మొదలైంది. కథ విన్న నచ్చడంతో సుప్రియగారు ఎవరితో ఈ సినిమా చేద్దామని అనుకున్నావ్ అని అడిగింది.
నాకు అలాంటి ఆలోచనలేం లేవని అన్నాను. అప్పుడు సుప్రియగారు రాజ్‌తరుణ్ అయితే బావుంటుందని అన్నారు. నేను స్టార్టింగ్ నుండి రాజ్‌తరుణ్ సినిమాలు చూస్తుండటం వల్ల తనైతే నా సినిమాకు సరిపోతాడనిపించి ఓకే చెప్పాను. అలా రాజ్‌తరుణ్ హీరోగా మా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించడంతో ఆడిషన్ చేశాం. ఆ ఆడిషన్‌లో చిత్ర శుక్లా సెలక్ట్ అయ్యారు. అమ్మాయిలందరికీ అబ్బాయిలేం చేస్తారో బాగానే తెలుసు. అందువల్ల అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో కథను రాసుకున్నాను'' అన్నారు.
చిత్ర శుక్లా మాట్లాడుతూ - ''తెలుగులో నా రెండో చిత్రం. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో చేయడం ఆనందంగా ఉంది. కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించే నెక్ట్స్ డోర్ గర్ల్ పాత్రలో కనపడతాను. రాజ్‌తరుణ్ చాలా మంచి కోస్టార్. తనతో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్. సెట్స్‌లో ఇద్దరం బాగా మాట్లాడుకునేవాళ్లం. తను షూటింగ్ సమయంలో బాగా సపోర్ట్ అందించారు. రంజనిగారు దర్శకత్వంలో చేయడానికి కష్టమనిపించలేదు. ఎందుకంటే ఆవిడ సీన్స్ చేయడానికి ముందు చేసి చూపించేవారు'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments