'భద్రం బీ హ్యాపీ హాలీవుడ్' అంటున్న శ్రీరాజ్ దాసిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంజినీరింగ్ టాపర్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి- తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న "భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్' చిత్రంతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరాజ్.. ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు.
హాలీవుడ్ లో 'రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్' వంటి సంచలన చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వలో రూపొందే ప్రతిష్టాత్మక ఆంగ్ల చిత్రంలో శ్రీరాజ్ దాసిరెడ్డి నటించనున్నాడు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై ఉబ్బితబ్బిబ్బు అవుతున్న శ్రీరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తెలుగువాడి సత్తా చాటుతానని అంటున్నాడు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com