శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన' - సీనియర్ నరేష్
- IndiaGlitz, [Friday,August 26 2016]
'దృశ్యం' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఆగస్ట్ 26న హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేష్, 'సూపర్‌హిట్' పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు, చిత్ర నిర్మాత వి.ఆర్. కృష్ణ ఎం. పాల్గొన్నారు. సీనియర్ నటుడు నరేష్ 'ఘటన' ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది!!
సూపర్‌హిట్ పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''సన్‌మూన్ క్రియేషన్ 'ఘటన' 'దృశ్యం'లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీప్రియ ఈ 'ఘటన' చిత్రాన్ని మనకి అందిస్తున్నారు. నిత్యామీనన్‌తో పాటు నరేష్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 31న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. 'ఇష్క్' ఫేమ్ అరవింద్ శంకర్ ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో పెద్ద హిట్ అయ్యింది. దర్శకురాలు శ్రీప్రియ, నిత్యామీనన్, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ యూనిట్ అంతా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో పాల్గొనబోతున్నారు. వి.ఆర్. కృష్ణగారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని తీశారు. అప్పట్లో 'ప్రతిఘటన' చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో డెఫినెట్‌గా ఈ 'ఘటన' కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో 'ఘటన' కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది'' అన్నారు.
ఆగస్ట్ 31న ప్లాటినవమ్ డిస్క్ ఫంక్షన్! సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్!!
చిత్ర నిర్మాత వి.ఆర్. కృష్ణ ఎం. మాట్లాడుతూ - ''సన్‌మూన్ క్రియేషన్స్ బేనర్‌లో తొలిసారిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. 'దృశ్యం'లాంటి అద్భుత చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీప్రియగారి డైరెక్షన్‌లో ఈ 'ఘటన' చిత్రాన్ని నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళంలో సూపర్‌హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రాన్ని భారీ ఆఫర్‌తో రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో 'ఘటన' పేరుతో నిర్మించాం. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో క్రిష్ జె. సత్తార్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సీనియర్ నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్, అంజలీరావు, జానకి, గౌతమి తదితరలు ఈ చిత్రంలో నటించారు. అరవింద్ శంకర్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. ఈనెల 31న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని చలన చిత్ర ప్రముఖులు, చిత్ర యూనిట్ సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరపనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచే చిత్రం!!
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ''గత 2,3 ఏళ్ళుగా చూస్తే తెలుగు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. భిన్నమైన కథ, కథనాలతో కొత్త జోనర్ ఫిలింస్ వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త అర్థాన్ని చెప్తునానఅ. రీసెంట్‌గా విడుదలైన 'పెళ్ళి చూపులు' చిత్రాన్ని కొత్త ఫ్లేవర్‌లో చూపించారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల్ని కోరుకుంటున్నారు. ఆ కోవకి చెందిన చిత్రం 'దృశ్యం'. తెలుగు సినిమా చరిత్రలో ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త కోణంలో తీసి సూపర్‌హిట్ చేయడమే కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని తీర్చిదిద్దారు శ్రీప్రియ. నా కెరీర్‌లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ 'దృశ్యం'లో చేశాను. మళ్ళీ శ్రీప్రియగారు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి కొత్త ఫ్లేవర్ వున్న కథతో 'ఘటన' చిత్రాన్ని రూపొందించారు. వి.ఆర్. కృష్ణగారు నిర్మాతగా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు.
మరో కొత్త క్యారెక్టర్‌లో ఈ చిత్రంలో నటించాను. ఖచ్చితంగా ఈ సినిమా యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. 'దృశ్యం'లాంటి పెక్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'ఘటన'. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నిత్యామీనన్ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేసింది.క జూత్త హీరో అయినా క్రిష్ సత్తార్ బ్యూటిఫుల్‌గా నటించాడు. కీ రోల్‌లో నేను ఒక పాత్రలో నటించాను. ప్రధానంగా ఈ సినిమా నిత్యామీనన్, క్రిష్ సత్తార్, నా రోల్ ఈ మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. ఒక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు శ్రీప్రియ. దాదాపు 150 చిత్రాల్లో నటించాను. ఇలాంటి రోల్ నేను ఇంతవరకూ చేయలేదు. ఎవరూ ఊహించనటువంటి ఒక కొత్త క్యారెక్టర్‌ని నేను చేసాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శ్రీప్రియగారికి వి.ఆర్. కృష్ణగారికి నా ధన్యవాదాలు. సొసైటీలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లెమ్‌ని తీసుకుని దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి మంచి మ్యూజిక్, ఫొటోగ్రఫీతో శ్రీప్రియగారు 'ఘటన' చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమాకి హిట్ చిత్రమే అవ్వడం కాకుండా ఒక గౌరవాన్ని తెచ్చే సినిమాగా నిలుస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నటుడిగా నాకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని నా నమ్మకం. మా అమ్మ తర్వాత నాకు నచ్చిన మహిళా దర్శకురాల్లో నాకు నచ్చిన దర్శకురాలు శ్రీప్రియ. ఒక కన్‌విక్షన్ నరేష్ ఈ పాత్ర చెయ్యాలి అని 'దృశ్యం'లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన కొత్త క్యారెక్టర్‌ని నాతో చేయించారు'' అన్నారు.