'అత్తారిల్లు' ఆల్ ఏరియా రైట్స్ సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్

  • IndiaGlitz, [Saturday,August 06 2016]

అంజన్ కళ్యాన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంలో మెలోడీబ్రహ్మ మణిశర్మ నేపధ్యసంగీతంలో అంజన్ కే కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన “ అత్తారిల్లు ” చిత్రానికి సంబందించిన ఆల్ ఏరియా రైట్స్ ను శ్రీలక్ష్మిపిక్చర్స్ అదినేత బాపిరాజు సొంతం చేసుకున్నారు.. ఈ సందర్భంగా బాపిరాజు సంతోషం వ్యక్తం చేస్తూ శ్యాం ప్రసాద్ రెడ్డి , కృష్ణ వంశీ , రాంగోపాల్ వర్మ లాంటి మహామహుల వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అంజన్ కే కళ్యాణ్ తెరకెక్కించిన అత్తారిల్లు నాకు బాగా నచ్చి తీసుకోవడం జరిగింది..
చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని మరోమారు రుజువు చెయ్యబోయే సినిమా ఇది.. మణిశర్మ గారు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ, భయపెట్టించే ధ్రిల్స్ ,వినసొంపైన రెండు మంచి పాటలతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఇటీవల విడుదలయిన టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.

More News

వ‌రుస సినిమాల‌తో అక్కినేని అభిమానుల‌కు ఇక పండ‌గే

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఆటాడుకుందాం...రా చిత్రాన్ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ‌సుశీల సంయుక్తంగా నిర్మించారు.

సునీల్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ తాజాగా జ‌క్క‌న్న సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారి వీడు గోల్డ్ ఎహే అనే టైటిల్ తో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడు. సునీల్ హీరోగా డైరెక్ట‌ర్ వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహే అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

నలుగురు స్టార్స్ తో అనుష్క‌...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు బాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ  సినిమా చేయ‌నుంది. శివ‌పుత్ర‌డు, వాడు వీడు, నేను దేవుణ్ని వంటి చిత్రాల‌తో తమిళం, తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌నదైన ముద్ర వేసిన ద‌ర్శ‌కుడు బాల త‌న త‌దుప‌రి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేశాడు.

హాలీవుడ్ మూవీలో రాంచ‌ర‌ణ్ విల‌న్‌..

రోజా, బొంబాయి వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరో అర‌వింద‌స్వామి మ‌ణిర‌త్నం క‌డ‌లితో రీ ఎంట్రీ ఇచ్చాడు. త‌నీ ఒరువ‌న్‌లో నెగ‌టివ్ రోల్ చేసిన‌ అర‌వింద్ స్వామి త‌న‌దైన న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించి ఇప్పుడు త‌నీ ఒరువ‌న్ తెలుగు రీమేక్ ధృవ‌లో కూడా రాంచ‌ర‌ణ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

పూరి మ‌ల్టీస్టార‌ర్ మూవీ....?

హీరోయిజంను కొత్త స్ట‌యిల్‌లో ప్రెజంట్ చేసే ద‌ర్శ‌కుల్లో పూరి ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఇజం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.