రాయుడులో భాగ్యలక్ష్మి ఆకట్టుకుంటుంది - హీరోయిన్ శ్రీదివ్య
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ - శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం మరుదు. విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రాయుడు టైటిల్ తో జి.హరి అందిస్తున్నారు. ఈ నెల 27న రాయుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ...ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు భాగ్యలక్ష్మి. ఫస్టాఫ్ లో బోల్డ్ గా కనిపించే నా క్యారెక్టర్ పెళ్లైన తర్వాత సెకండాఫ్ లో చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. నా క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. విలేజ్ గాళ్ గా నటించాలన్నప్పుడు ఎలా ఉండాలి..ఎలా మాట్లాడాలి అని ఆలోచించాను. విలేజ్ లో కొంత మందిని పరిశీలించాను. అయితే... కొంత మంది తక్కువ మాట్లాడుతుంటుంటే...కొంత మంది స్టైల్ గా మాట్లాడుతున్నారు. ఇక లాభం లేదనుకుని డైరెక్టర్ ముత్తయ్య ఎలా చెబితే అలా చేసాను. డైరెక్టర్ ప్రతి సీన్ ని ఎలా చేయాలో నటించి చూపించేవారు అది నాకు బాగా హెల్ప్ అయ్యింది. గత చిత్రాలకు భిన్నంగా ఉండే నా క్యారెక్టర్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.
విశాల్ తో వర్క్ చేయాలన్నప్పుడు ఎలా ఉంటారో అని ఫస్ట్ భయపడ్డాను. సెట్స్ లో విశాల్ అందరితో ఫ్రెండ్లీగా ఉండడం చూసిన తర్వాత భయం పోయింది. ఆయన అందరితో ఒకేలా ఉంటారు. ఇంకా చెప్పాలంటే...విశాల్ హీరో కన్నా చాలా మంచి మనిషి. షూటింగ్ కోసం తమిళనాడులోని రాజపాలయం అనే ఊరు వెళ్లినప్పుడు అక్కడ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్లు. అప్పుడు విశాల్ స్పందించి సహాయం చేసారు. నేను నా వంతుగా పది టాయిలెట్స్ కట్టిస్తానని చెప్పాను. ఈ సినిమాకి తమిళనాడులో పదేళ్ల తర్వాత విశాల్ కి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు.ఈ చిత్రంలోని ఒంటి జెడ రోజా అనే పాట శ్రోతలను విశేషంగా అలరిస్తుంది. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. నెక్ట్స్ కాష్మారా అనే చిత్రం, జీవా తో ఓ చిత్రం చేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments