జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవి 'మామ్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల తెలుగు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే 'మామ్' కోసం హీరోని శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సెలెక్ట్ చేయడం. 2007లో విడుదలైన 'ఎ మైటీ హార్ట్' అనే హాలీవుడ్ చిత్రంలో ఏంజెలినా జోలీ సరసన నటించిన అద్నన్ సిద్ధిఖి అయితే శ్రీదేవికి కరెక్ట్ జోడీ అని గుర్తించిన కూతురు జాన్వి కపూర్ ఈ విషయాన్ని తండ్రి, ప్రొడ్యూసర్ అయిన బోనీకపూర్ దృష్టికి తీసుకెళ్ళడం, అతను ఓకే అనడం, అద్నన్‌ని టెస్ట్‌కి పిలిపించడం జరిగిపోయింది. లుక్ టెస్ట్ చేసిన తర్వాత జాన్వి సెలెక్షన్ కరెక్ట్ అని శ్రీదేవి సరసన నటించేందుకు అద్నన్ సిద్ధిఖీనే ఎంపిక చేశారు నిర్మాత బోనీకపూర్, దర్శకుడు రవి ఉద్యవార్. అప్పటి వరకు ఆ క్యారెక్టర్ ఎవర్ని సెలెక్ట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్న యూనిట్‌కి జాన్వి పరిష్కారం చూపించింది. అలా శ్రీదేవికి జోడీని సెలెక్ట్ చేయడంలో జాన్వి కపూర్ వార్తల్లోకి ఎక్కింది.
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, ఎడిటింగ్: మోనిసా బల్ద్వా, కథ: రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లి, కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: గిరీష్ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం: రవి ఉద్యవార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments