శ్రీదేవిపై ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల బాలీవుడ్లో సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమా వచ్చింది. క్రికెట్లో దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్‌పై ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో సీనియర్ నటీమణి శ్రీదేవిపై కూడా ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించాలని బెంగుళూరుకు చెందిన ఆమె ఫాన్స్ క్లబ్ నిర్ణయించింది. ఈ డాక్యుమెంటరీని ఐదు భాగాల సిరీస్ గా రూపొందించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం గురించి ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను సంప్రదించడం..ఆయన కూడా సానుకూలంగా స్పందిండం జరిగిందట. ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. తొలి భాగంలో శ్రీదేవి బాల్యానికి సంబంధించి ఆమె సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది అన్న విషయాన్ని చూపించనున్నారు. ఇక రెండు, మూడు భాగాలకు సంబంధించి బాలీవుడ్ లో ఆమె ప్రవేశం, ఆపై ఆమె జీవితం చూపిస్తూనే..నాల్గవ భాగంలో ఆమె సాధించిన సినీ విజయాల వివరాలను విశదీకరించనున్నారు. ఇక ఆఖరి భాగమైన ఐదవ భాగంలో శ్రీదేవితో కలిసి నటించిన నటీనటుల ఇంటర్వ్యూలతో కూడిన సినిమా వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయని ఆమె అభిమానుల సంఘం పేర్కొంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు కూడా చూపించనున్నామని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com