బిగ్ బాస్ 5 తెలుగు : శ్రీరామ్‌కు సోనూసూద్ సపోర్ట్… టైటిల్ గెలిచినట్లేనా ?
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. 5వ సీజన్లో టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామచంద్ర కూడా ఒకరనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. షోలో ఎవరు ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా... విన్నర్‌ని ఎంపిక చేసే అంతిమ నిర్ణయాధికారం మాత్రం ప్రజలదే. అందుకే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమకు ఓట్ చేయాలని హౌస్‌లోకి వెళ్లేముందే విజ్ఞప్తి చేశారు. ఈ రకంగా చూస్తే శ్రీరామచంద్రకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు బాగానే ఉన్నాయని అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే శ్రీరామ్‌కి కొంతమంది సినీ ప్రముఖులు కూడా తమ మద్ధతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ అని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ఆయనకు ఓటు వేయాలని తన అభిమానులను ప్రత్యేకంగా కోరింది. అంతేకాదు హిందీ కమెడియన్ భారతీ సింగ్ సైతం తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఇప్పుడు ఏకంగా ఓ పెద్ద స్టార్ సపోర్ట్ శ్రీరామ్‌కి దక్కింది. ఆయన ఎవరో కాదు. సోనూసూద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో స్వగ్రామాలకు వెళ్లలేకపోయిన ఎంతోమంది నిరుపేద వలస కార్మికులను బస్సులు, కార్లలో గమ్యస్థానాలకు పంపారు. ఆ తర్వాత కూడా సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ రియల్ హీరోగా మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కూడా శ్రీరామ్ గురించి ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. నీకు ఇవే నా అభినందనలు అంటూ సోనూ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. సోనూకు యావత్ భారతదేశంతో పాటు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ వుండటంతో ఆయనను అభిమానించేవారంతా శ్రీరామ్‌కి ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఇంకేముంది ఈసారి బిగ్‌బాస్ విన్నర్ శ్రీరామేనని కామెంట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout