శ్రీనువైట్ల ప్రొడక్షన్...

  • IndiaGlitz, [Friday,April 14 2017]

ద‌ర్శ‌కుడుగా మంచి పేరున్న శ్రీనువైట్ల ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. అయితే ఈ ప్రొడ‌క్ష‌న్ సినిమాల‌ను కాకుండా సీరియ‌ల్స్‌ను నిర్మిస్తుంద‌ట‌. వైవా హ‌ర్ష‌తో ఓ కామెడి సీరియ‌ల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అమృతం స్ట‌యిల్లో ఉండే ఈ సీరియ‌ల్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చ‌నున్న ఈ సీరియ‌ల్ పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి. ప్ర‌స్తుతం శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ట్ర‌యాంగిల్ ట్రావ‌ల్ ల‌వ్ స్టోరీ మిస్ట‌ర్ ఈరోజు(ఏప్రిల్ 14న) విడుద‌ల‌వుతుంది.