'అమర్ అక్బర్ ఆంటోనీ' పనులు మొదలుపెట్టిన శ్రీనువైట్ల
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల. అయితే.. అదంతా గతం. ప్రస్తుతం హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో పూర్తిగా వెనుకబడిపోయారాయన. మళ్ళీ ఈ డైరెక్టర్ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కించడానికి మాస్ మహారాజా రవితేజ ముందుకొచ్చారు. ఈ ఇద్దరి కలయికలో ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయి శీను’ వంటి హ్యాట్రిక్ విజయాలు ఉండడంతో కొత్త చిత్రంపై సహజంగానే అందరికి ఆసక్తి ఏర్పడింది.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణని ప్రారంభించేసారు శ్రీను వైట్ల. తాజా సమాచారం ప్రకారం.. రవితేజ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘నేల టిక్కెట్టు’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తైన తర్వాత అంటే.. ఈ నెల రెండు లేదా మూడో వారంలో శ్రీనువైట్ల సినిమా కోసం రవితేజతో పాటు కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ కూడా అమెరికా పయనమవుతారని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు 11 సంవత్సరాల తర్వాత రవితేజ, శ్రీను వైట్ల కలయికలో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments