హాట్ యాంకర్ శ్రీముఖిపై అభిమానం .. ఆమె పేరు టాటూగా వేయించుకున్న ఫ్యాన్
Send us your feedback to audioarticles@vaarta.com
మనదేశంలో హీరో, హీరోయిన్లకు వున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ తారలను దైవంలా పూజిస్తూ.. వారికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేక ప్రాణాలు సైతం వదిలేవారు ఎందరో. సినీతారలతో పాటు యాంకర్లకు కూడా మన దగ్గర పాపులారిటీ ఎక్కువే. సోషల్ మీడియా రాకతో యాంకర్స్ తమ హాట్ ఫోటోలను, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. వీరిలో తెలుగు యాంకర్స్ కూడా వున్నారు. ఉదయభాను, ఝాన్సీ, సుమ, శిల్పా చక్రవర్తి, అనసూయ, శ్రీముఖీ, శ్యామల, రష్మీ వంటి వారికి యువతలో మంచి క్రేజ్ వుంది. వీరంతా స్టార్ యాంకర్లుగా చలామణీ అవుతూ ఈవెంట్లు, సినిమాల్లో ఛాన్సులతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.
తాజాగా యాంకర్ శ్రీముఖీపై అభిమానం చాటుకున్నాడో వ్యక్తి. ఏకంగా ఆమె పేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ అభిమాని పేరు తరుణ్ కుమార్. ఈ విషయం శ్రీముఖి దృష్టికి కూడా వచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి... అంతకు ముందు, ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాలకు హోస్ట్, యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది 'క్రేజీ అంకుల్స్', 'మ్యాస్ట్రో' వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమాలో ఓ రోల్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments