Sreekaram Review
వ్యవసాయం,రైతులు చుట్టూ తిరిగే సినిమాలు కృష్ణగారి కాలంలో చేసేవారు. ఈ మధ్యన అయితే మహేష్ మహర్షి మాత్రమే వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీకారం అంటూ శర్వానంద్ సైతం ఉత్సాహంగా మట్టిలోకి అడుగుపెట్టాడు. లుంగి ఎగగట్టి కలుపు తీసి,నాట్లు వేసి, కొత్త తరహా వ్యవసాయం అంటూ విలేజ్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ థియోటర్ లో దిగాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆ కాన్ఫిడెంట్ ఈ సినిమాలో మనకు ఏ మేరకు కనపడుతుంది. సినిమాలో కొత్తగా చెప్పిందేమిటి..అసలు ఈ సినిమా కథేంటి విషయాలు చూద్దాం.
కథేంటి
అనంతపురంలో నీళ్లు సరిగ్గా అందక పొలాలు పండవు. కరువు రాజ్యం ఏలుతూండటం సర్వ సామాన్యం. దాంతో అక్కడ రైతులు అటు వ్యవసాయం వదిలి వెళ్లలేక, అలాగని చేసి అప్పులు పాలు కాలేక నానా యాతన పడుతూంటారు.అక్కడ ఓ ఊళ్లో ఏకాంబరం (సాయి కుమార్)..తన ఊళ్లో వాళ్లకు ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులిచ్చి, అవి కట్టలేకపోతే తక్కువ రేటుకు ఆ పొలాలని సొంతం చేసుకుంటూంటాడు. అదే ఊరికి చెందిన కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్(శర్వానంద్). చిన్నప్పటినుంచీ ఈ ఈతిబాధలు చూసి బయిటపడాలని బాగా చదువుకుని సాప్ట్ వేర్ ఇంజినీర్ అవుతాడు. తన తండ్రి చేసిన అప్పుని తీర్చేస్తాడు. అంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అయితే కార్తీక్ ఓ నిర్ణయం తీసుకుంటాడు.
లగ్జరీ సిటీ లైఫ్ ని ..సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని,విదేశాలకు వెళ్లే ఆఫర్ ని కూడా వదిలేసి వ్యవసాయం చేస్తానని తన ఊరుకు వచ్చేస్తాడు. ఇది ఎవరికీ అర్దం కాదు. తండ్రి సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. అయినా సరే తన కుటుంబలో తరతరాలు గా మట్టిని నమ్ముకున్న వారసత్వాన్ని వదిలేదు లేదు అని వ్యవసాయం చేయటం మొదలెడతాడు. ఇక్కడ బ్రతకలేక ఊరు వదిలేసిన చాలా మందిని వెనక్కి పిలిపిస్తాడు. ఈ క్రమంలో అనేక కొత్త వ్యవసాయ పద్దతులను ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇదంతా కార్తీక్ ఎందుకు చేస్తున్నాడు. అసలు అతని మనస్సులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటి..సాప్ట్ వేర్.. ఇంజినీర్ వ్యవసాయంలో సక్సెస్ అయ్యాడా...తండ్రి చివరకు కొడుకు ఆలోచనలను ఏక్సెప్ట్ చేసాడా, ఇవన్నీ చూస్తూ సాయికుమార్ ఊరికే ఉన్నాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది...
విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వ్యక్తి వెనక్కి వచ్చి వ్యవసాయం చేయటం అనే కాన్సెప్టుతో గతంలో మనకు మహర్షి సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఎంత పోల్చకూడదనుకున్నా ఈ విషయం గుర్తు చేసుకోవటం తప్పదు. ఎందుకంటే చాలాసార్లు ఆ సీన్స్ గుర్తు వస్తూంటాయి. ఒకే సీన్ కాకపోయినా ..ఒకే భావంతో రూపొందిన సీన్స్ కొన్ని ఉండటం..దాదాపు ఒకే స్టోరీ లైన్ కావటం ఈ సినిమాని మినీ మహర్షిలా కనిపించేలా చేస్తాయి. అలాగే ఈ సినిమా మొదట ఇదే టైటిల్ తో వచ్చిన ఓ షార్ట్ ఫిలిం ఆధారంగా చేసారు. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు పల్లెల నుంచి వచ్చిన వారికి జ్ఞాపకాలుగా వస్తాయి. ఫస్టాఫ్ బాగానే నడిచినా,సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్త కొత్తగా వెళ్లితే బాగుండేదే అనిపిస్తుంది. అలాగే మేజర్ కాంప్లిక్ట్ పెద్దగా కనపడదు. దాంతో సీన్స్ అలా వచ్చి వెళ్తున్న ఫీల్ ఉంటుందే కానీ ఎక్కడా బలమైన ముద్ర వేయవు. ఇక శర్వానంద్ క్యారక్టరైజేషన్ చూస్తూంటే శతమానం భవతి గుర్తుకు రావటం ఓ పెద్ద మైనస్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో కాస్తంత సర్దుకున్నారు. అలాగే సినిమాలో నరేష్ , రావు రమేష్ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి.లవ్ ట్రాక్ మాత్రం అసలు పండలేదు. దీనికి తోడు ఫీల్ కోసం ..స్లో నేరేషన్ లో సినిమాని నడపటం జరిగింది. అయితే ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం, టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచటం వంటివి బాగున్నాయి.
టెక్నికల్ గా
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ లో సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు, యువరాజ్ సినిమాటోగ్రఫీ , మిక్కీజే మేయర్ మ్యూజిక్. ఈ మూడు ఈ సినిమాని మోసుకుంటూ చివరిదాకా సాగాయి. ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో శర్వానంద్ ..యువ రైతుగా బాగున్నాడు. నరేశ్, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఆమని, రావు రమేష్,సాయి కుమార్ తమదైన శైలిలో గుర్తుండిపోయేలా చేసారు.
చూడచ్చా
విలేజ్, వ్యవసాయం తో అనుబంధం ఉన్నవాళ్లకు నచ్చుతుంది.
Read 'Sreekaram' Movie Review in English
- Read in English