BiggBoss6:హౌస్‌లో సందడి చేసిన మాజీలు... ‘‘స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్’’గా శ్రీహాన్
Send us your feedback to audioarticles@vaarta.com
మరో రోజులో బిగ్‌బాస్ 6 తెలుగుకి తెరపడనుంది. మరికొద్దిగంటల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఐదుగురు మిగిలారు. కప్ కొట్టినా కొట్టకున్నా ఫైనల్‌కైతే చేరుకున్నాం కదా అన్న సంతోషంలో వీరంతా వున్నారు. రేపు విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఫైనల్ విన్నర్ ఎవరో తేల్చేది బిగ్‌బాస్ మాత్రమే.
ఇక ఫినాలేకు ఒక రోజు ముందు శనివారం హౌస్‌మేట్స్ అంతా ఆట పాటలతో గడిపేశారు. బిగ్‌బాస్ గత సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు హౌస్‌లోకి ప్రవేశించి సందడి చేశాడు. అషురెడ్డి- మెహబూబ్, రవికృష్ణ - భాను, చైతు - కాజల్, రోల్ రైడా - స్రవంతి, ముక్కు అవినాశ్ - అరియానా, అఖిల్ సార్థక్ - తేజస్వి, అర్జున్ - వాసంతి, సూర్య - ఫైమాలు ఆటపాటలతో అలరించారు. ముందుగా రోల్‌రైడా వచ్చి... హుషారు తెప్పించాడు. అతనితో కలిసి రేవంత్ కూడా పాటలు పాడాడు.
ఆ కాసేపటికీ అషు రెడ్డి , మెహబూబ్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరు కలిసి శ్రీహాన్, రేవంత్ మధ్య ఓ గేమ్ పెట్టారు. కానీ ఇందులో ఇద్దరూ ఓడిపోవడం విశేషం. తర్వాత కీర్తి, ఆదిరెడ్డి ఆడారు. ఈ టాస్క్‌లో ఆన్సర్ తెలిసినప్పటికీ తప్పుడు జవాబులు చెప్పాలి. దీనిలో భాగంగా కీర్తి.. ఆదిరెడ్డిని శ్రీహాన్ లవర్ పేరు ఏంటీ అని అడిగింది. రూల్ ప్రకారం ఆదిరెడ్డి ఇనయా అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ ఆది మీదకు వెళ్లాడు. సరదాగా సాగిపోతున్న సమయంలో ఇంటి సభ్యులకు షాకిచ్చారు మాజీలు. తమతో పాటు ఒకరిని తీసుకెళ్తామని కంగారు పెట్టారు.
కాజల్‌తో కలిసి వచ్చిన చైతూ.. సీజన్ 6లోని టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి ఒక్క మాటలో చెప్పాడు. శ్రీహాన్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్, రేవంత్ అంటే కోపం, ఆదిరెడ్డి అంటే ఆత్మవిశ్వాసం, రోహిత్ అంటే సైలెంట్, కీర్తి గేమ్ బాగా ఆడుతోంది అంటూ చెప్పాడు. తర్వాత కంటెస్టెంట్స్‌కి కొన్ని వస్తువులు ఇచ్చి వాటిని ఆడతూ డ్యాన్స్ చేయాలనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కీర్తి గెలిచింది. చివరిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపు వచ్చింది కాబట్టి కంటెస్టెంట్స్ మీద అభిప్రాయాలు కూడా మారే వుంటాయని.. అదేంటో చెప్పాలన్నాడు.
తొలుత శ్రీహాన్ మాట్లాడుతూ.. కీర్తి జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చిందని ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ వైఖరి తొలుత యాటిట్యూడ్‌లా అనిపించిందని, కానీ అది నిజం కాదని తర్వాత అర్ధమైందన్నాడు. రోహిత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డికి తప్పును అంగీకరించే మనస్తత్వం వుందన్నాడు. రేవంత్ మాట్లాడుతూ... ఆదిరెడ్డిని అర్ధం చేసుకోలేకపోయానని అన్నాడు. కీర్తి మాట్లాడుతూ... శ్రీహాన్ జెన్యూన్ అని చివరిలో తెలిసిందని చెప్పింది.
ఇదిలావుండగా.. బిగ్‌బాస్ 6 తెలుగులో కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో లెన్స్ కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీహాన్ గెలిచాడు. స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. ఇక రేపు ఫైనల్ కావడంతో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments