'శీనుగాడి ప్రేమ ' ఆడియో లాంచ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
సుష్మ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై శ్రీనివాసరావు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `శీనుగాడి ప్రేమ`. సిన్సియర్ రా మామా ట్యాగ్ లైన్. ఆర్.కె.దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎప్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సీడీ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.... ``పాటలు, టీజర్ చాలా బావున్నాయి. కొత్తవారైనా ఎంతో అనుభవం ఉన్న నటీనటుల్లా నటించారు. దర్శకుడు ఆర్.కె. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దాడు. కొత్తవారు చిత్ర పరిశ్రమకు రావాలి. ఇలాంటి చిత్రాలను ఆదరించాలి. నా వంతు ప్రయత్నంగా థియేటర్స్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. మంచి పబ్లిసిటీతో సినిమాను సరైన డేట్ చూసుకుని విడుదల చేయాల్సిందిగా దర్శక నిర్మాతలకు సూచిస్తున్నా`` అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ... ``పాటలు వినసొంపుగా ఉన్నాయి. కంటెంట్ ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా పాటలు విన్నాక, టీజర్ చూశాక విభిన్నమైన చిత్రంగా అనిపించింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
వీర శంకర్ మాట్లాడుతూ... `` మంచి క్యాచీ టైటిల్‌తో సినిమా చేశారు. మంచి ఎఫర్ట్, టాలెంట్ తో చేసిన ఈ సినిమా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.... ``పాటలు చాలా క్యాచీగా ఉన్నాయి. సంగీత దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరో లో మంచి ఈజ్ ఉంది. దర్శకుడు అందరికీ నచ్చే విధంగా తీసినట్టుగా టీజర్, పాటలు చూశాక అర్ధమైంది`` అన్నారు.
సంగీత దర్శకుడు రమణ సాకే మాట్లాడుతూ... ``ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. పూర్తి స్వేచ్ఛనిచ్చి నాతో మంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. పాటలు విని ప్రేక్షకులకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
హీరో-నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ... ``నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మా దర్శకుడు ఓ రోజు నేను డైలాగ్స్ చెప్పే విధానం చూసి హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటిస్తూ, నేనే నిర్మించాను. దర్శకుడు ఆర్.కె. చెప్పిన దానికంటే సినిమాను అద్భుతంగా చిత్రీకరించాడు. రమణ సాకే క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. వైజాగ్, అరకు, తిరుపతి, కాణిపాకం, చిత్తూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. టీమ్ అంతా పూర్తి సహకారాన్ని అందించడంతో సినిమాను అనుకున్న విధంగా చేయగలిగాను`` అన్నారు.
దర్శకుడు ఆర్.కె.మాట్లాడుతూ.... `` శీను అనే పేరు చాలా మందికి ఉంటుంది. అలా శీనులందరికీ కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం.లవ్, కామెడీ, ఎమోషన్ ఇలా ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు పొందుపరిచాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా...మా నిర్మాత వాటన్నింటినీ అధిగమించి ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కచ్చితంగా సక్సెస్ కొడతాం అన్న నమ్మకంతో ఉన్నాం`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కె.సురేష్‌బాబు, బిందు, హీరోయిన్స్ ప్రణవి,కావేరి, చాందిని, జబర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరాః కారే సతీష్ కుమార్, రమణ; సంగీతంః రమణ సాకే; ఎడిటింగ్ః లక్ష్మణ్; దర్శకత్వంః ఆర్.కె.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com