శ్రీధర్ సీపాన 'బృందావనమది అందరిది' ప్రధాన తారాగణం వీరే
Send us your feedback to audioarticles@vaarta.com
జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల మరియు ప్రభాకర్ రెడ్డి కూతురు (యన్. అర్. ఐ ) నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బృందావనమది అందరిది'.
ఈ మూవీ ప్రధాన నటి నటులను ఇప్పటివరకు ప్రకటించలేదు వాళ్ళని జనవరి1 2018 నూతన సంవత్సరం రోజు ప్రకటించాలని ఈ రోజు మీడియా లో విడుదల చేస్తున్నాము ఈ సందర్భం గా దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ..
మా "బృందావనమది అందరిది" మూవీకి ప్రధాన తారగణాన్ని ఈరోజు జనవరి 1 -1- 2018 న మీడియాలో విడుదల చేయడం చాలా సంతోషం గా ఉంది. ముందుగా మీడియా మిత్రులకి నా శ్రేయోభిలాషులు లకు తెలుగు సినీ ప్రేమికులకు అందరికి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను రాసుకున్న స్టోరీ కి కొత్తవాళ్ళు తో చేయాలనుకున్న విషయం మీకు తెలిసిందే చాలా ఆడిషన్స్ వచ్చాయి కానీ ప్రధాన తారాగణం నలుగురు ఆర్టిస్టులను మినహా మిగతా కాస్టింగ్ లో చాలామంది కొత్తవాళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఈ రోజు రెపట్లో మా ఆఫీస్ నుండి మెస్సెజ్ లు పంపించడం జరుగుతుంది మా ప్రధాన తారాగణం లో ముందుగా మెయిన్ హీరో సిద్దు( గుంటూర్ టాకీస్ ఫేమ్ ) ని తీసుకోవడానికి కారణం ఫ్రెష్ టేలెంట్ గుంటూర్ టాకీస్ లో సిద్దు నటన నాకు నచ్చి నా కథలోని కెరెక్టర్ కి సిద్దు అప్ట్ అని సిద్ధుని తీసుకోవడం జరిగింది .
రెండవ కీ రోల్ మాస్టర్ విక్రమ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమ్ చేసిన రుద్రమదేవి, రేసుగుర్రం, పటాస్ విక్రమ్ చాలా బాగా నటించాడు ఆ మూవీస్ చూసి విక్రమ్ ని సెలక్ట్ చేయడం జరిగింది విక్రమ్ మంచి ఆర్టిస్ట్ అవుతాడు చాలబాగా చేస్తున్నాడు మూడవ ఆర్టిస్ట్ రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ ఈమె నటన గురించి నేను చెప్పక్కర్లేదు ఆమె నటనతో మా స్క్రిప్ట్ కి సీరత్ కపూర్ 100%అప్ట్ అవుతుంది తన గ్లామర్ కూడా సినిమాకి ప్లేస్ అవుతుంది.
చివరిగా మా నాలుగో పిల్లర్ మా 30 ఇయర్స్ పృద్వి నేను చేసిన ఆహానా పెళ్ళంట మూవీ నుండి ఇప్పటివరకు నాతో నా సినిమాలతో ట్రావెల్ చేసిన మా పృద్వి మరో సారి తన కామెడీ తో నటవిశ్వరూపం మా మూవీ లో చూస్తారు సింపుల్ గా చెప్పాలంటే నాలుగురూ నా సినిమా కి మెయిన్ పిల్లర్స్ డిసెంబర్ 29 నుండి షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది ఈ సంక్రాంతి కి "బృందావనమది అందరిది" ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాము.
ముఖ్యమైన విషయం మాకు లగడపాటి శ్రీధర్ గారు సలహాలు సూచనలను ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ గారికి మా టీమ్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటునము సంక్రాంతి పండుగ కి షూటింగ్ చిన్న గేప్ తీసుకొని జనవరి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అలాగే నా తరుపున మా చిత్ర యూనిట్ తరపున అందరికి మరోసారి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు శ్రీధర్ సీపాన.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments