చెన్నై హీరోయిన్‌తో...

  • IndiaGlitz, [Thursday,August 02 2018]

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. రీసెంట్‌గా 'నీది నాది ఒకే క‌థ‌' వంటి స‌క్సెస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు 'వీర‌భోగ వ‌సంత రాయలు' సినిమాలో గ్ర‌హంత‌ర‌వాసిగా న‌టిస్తున్నారు. దీంతో పాటు 'తిప్ప‌రా మీసం' అనే సినిమాలో కూడా న‌టిస్తున్నారు.

అసుర ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు స‌ర‌స‌న చెన్నైకి చెందిన మోడ‌ల్ నిక్కీ తంబోలి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.