శ్రీవిష్ణు హీరోగా 'ఎల్.ఎల్.పి' చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,December 06 2019]

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు నేడు సంస్థ కార్యాలయంలో జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన 'హాసిత్ గోలి' ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.

వినోదం తో కూడిన డ్రామా ఈ చిత్ర కధలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి.

శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం వివేకసాగర్, ఛాయాగ్రహణం వేదరామన్. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

More News

ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం లభించింది: పవన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ బాధితురాలి తల్లిదండ్రులు..

శభాష్ పోలీస్ అంటూ పూల వర్షం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్ ఇదీ..

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’లో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

కొవ్వొత్తులతో తెలుగు సినిమా పరిశ్రమ ర్యాలీ

జస్టిస్ ఫర్ దిశ - ఈ దిశగానే తెలుగు సినిమా రంగం కదిలింది. మానవ మృగాల బారినపడి అసువులు బాసిన డా. దిశకు చిత్రపరిశ్రమ యావత్తూ ఘనంగా నివాళులర్నించింది.

‘సాహో’ సజ్జనార్... జై జై సజ్జనార్..!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.