వీర భోగ వసంత రాయలు లో శ్రీవిష్ణు ఫస్ట్ లుక్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు '.. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లుక్ విష్ణు షర్ట్ లేకుండా, బాడీ మొత్తం టాటూలతో కనిపిస్తున్నాడు.. సరికొత్త హెయిర్ స్టైల్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న విష్ణు తెరపై తొలిసారి షర్ట్ లేకుండా కనిపిస్తూ అందరిని అలరించనున్నాడు.
ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి 'కల్ట్ ఈజ్ రైజింగ్' అనేది టాగ్ లైన్.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ని బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావు బెల్లన నిర్మిస్తుండగా ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వినూత్నమైన కథతో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 26 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com