అవినీతిపై యుద్ధం .. సామాజిక కోణంలో శ్రీవిష్ణు ‘‘భళా తందనాన’’ , ఆకట్టుకుంటున్న టీజర్
- IndiaGlitz, [Friday,January 28 2022]
హిట్టు ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా కొత్తదనం వున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వుంటారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ఆకట్టుకున్నారు. గతేడాది విడుదలైన అర్జున ఫల్గుణ సైతం ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా శ్రీవిష్ణు నటించిన చిత్రం భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భళా తందనానకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.
”రాక్షసుడ్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మామూలు మనిషిని…” అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ”నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కి కూడా రిస్కే, లంచం లేనిదే – కంచంలో అన్నం కూడా దొరకడం లేదు..” ”సీఎం కుర్చీలో కుర్చున్న ఎవరైనా, ఒక్క సంతకంతో మొత్తం స్టేజ్ ఫ్యూచర్‌నే మార్చేయొచ్చు. అంటే ఆ పవర్.. చేతిదా, లేదంటే కుర్చీదా?” అనే డైలాగ్స్ బాగున్నాయి.
చూస్తుంటే భళా తందనాన సినిమా అవినీతిపై ఓ సామాన్యుడు చేస్తున్న యుద్ధంలా కనిపిస్తోంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మరింత బలాన్నిచ్చింది. విజువల్స్ బాగున్నాయి. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాణంతో , బసంతి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి తన రెండు సినిమాల్లోనూ సందేశం అందించాడు. ఇప్పుడు 'భళా తందనాన'లోనూ అదే ఫార్ములా వర్కవుట్ చేస్తున్నాడు. మరి సినిమా ఎలా వుండనుందో తెలియాలంటే ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే.