BiggBoss: కెప్టెన్‌గా శ్రీసత్య.. తొండాట అంటూ అలిగిన ఇనయా, గీతూపై ఆది శపథం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం జరుగుతున్న మిషన్ పాజిబుల్ టాస్క్‌తో ఇల్లు దద్దరిల్లుతోంది. అరుపులు, కేకలు, గొడవలతో పాటు కంటెస్టెంట్స్ ఫిజికల్‌గా మారడంతో ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో టీషర్ట్స్ దొంగిలించనని ఆదిరెడ్డికి చెప్పిన గీతూ.. తాను మాత్రం చోరీ చేసేసింది. తర్వాత విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి.. ఇలా చేయడం సరికాదన్నాడు. నేను స్ట్రాటజీ వాడి నీ వీక్నెస్ అయిన మంచితనం మీద కొట్టానని గీతూ తన పనిని సమర్ధించుకుంది.
అయితే చనిపోయిన సభ్యులు టాస్క్‌లో ఆడలేరని గీతూకి షాకిచ్చాడు బిగ్‌బాస్. అలాగే ఆదిరెడ్డి టీషర్ట్‌ని దొంగిలించినా అతను చనిపోడని తెలిపాడు. కానీ మైక్‌ని విసిరి నేలకు కొట్టిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు. దీంతో తన వల్ల గేమ్‌లో ఔట్ అయినందుకు ఆదిరెడ్డికి క్షమాపణలు చెబుతూనే వుంది గీతూ. త్వరలో నిన్ను కూడా ఏడిపిస్తానని.. ఆ దెబ్బ ఎలా వుంటుందో చూద్దువుగానీ అంటూ ఆదిరెడ్డి శపథం చేశాడు.
తర్వాత మిషన్ పాజిబుల్ టాస్కు ముగిసిందని ప్రకటించాడు బిగ్‌బాస్. కానీ రెండు జట్లు సమాన పాయింట్లు సాధించడంతో గేమ్ డ్రా అయ్యింది. దీంతో రెండు జట్ల కెప్టెన్లు ముగ్గురిని కెప్టెన్సీ కంటెండర్లుగా చేయాలని ఆదేశించారు. అలా రెడ్ టీమ్ నుంచి గీతూ, శ్రీసత్య, ఫైమా.... బ్లూటీమ్ నుంచి వాసంతి, ఇనయా, మెరీనాలు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. తొలిసారి అందరూ ఆడవాళ్లే కెప్టెన్సీ కిరీటం కోసం తలపడటం విశేషం. వారికి ఒక్కొక్కరికి ఒక్కో బెలూన్ ఇచ్చి వాటిని కాపాడుకుంటూ ఇతరుల బెలూన్లను పగులగొట్టాలి. చివరి వరకు ఎవరి బెలూన్ పగలకుండా వుంటుందో వారే ఈ వారం కెప్టెన్. ఈ టాస్క్‌కు ఆదిరెడ్డి సంచాలక్‌గా వ్యవహరించాడు. గీతూ, ఫైమాలు సాయం చేయడంతో శ్రీసత్య ఈ వారం కెప్టెన్‌గా అవతరించింది. ఇనయా కెప్టెన్ కాకపోవడంతో శ్రీహాన్, రేవంత్, గీతూ, ఫైమాలు గాల్లో తేలారు. అరుపులు , కేకలతో గోల గోల చేశారు. దీంతో అందరూ ఒక్కటై తనను ఓడించారంటూ ఇనయా కోపంగా వెళ్లిపోయింది.
ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా,ఫైమా ఇలా మొత్తం పది మంది నానినేషన్స్లో వుండగా.. కెప్టెన్ శ్రీహాన్, రాజ్, వాసంతిలను ఒక్కరూ నామినేట్ చేయకపోవడం విశేషం. ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎవరికి కాంప్లిమెంట్ ఇస్తారో, ఎవరికి క్లాస్ పీకుతారోనని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments