రవితేజతో శ్రీలీల.. ధమాకాలో ‘‘ప్రణవి’’ ఫస్ట్‌లుక్ చూశారా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. ఇప్పటికే ‘‘ఖిలాడీ’’ని థియేటర్లలోకి దించిన రవితేజ.. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. రవితేజ మార్క్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఓ కథానాయికగా 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మూవీలోని శ్రీలీల ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
'ధమాకా'లో ఆమె క్యారెక్టర్ పేరు ప్రణవి అని రీవిల్ చేశారు. హీరో రవితేజతో కలిసి ఓ గోడ మీద కూర్చొని పొట్లాంలో ఏదో తీసుకుని తింటున్న స్టిల్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ని హీరోయిన్ శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ధమాకా సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో స్వరాలు సమకూరుస్తున్నారు.
మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లోనూ శ్రీలీలకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి హీరోగా 'అనగనగా ఒకరాజు' , వైష్ణవ్ తేజ్ హీరోగా మరో సినిమా తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీ లీలకు అవకాశం దక్కినట్లుగా ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com