నటి శ్రావణి కేసు: దేవరాజు ఒక ప్లేబాయ్‌గా గుర్తించిన పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసు డైలీ సీరియల్‌ను మించిన మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గంటకో కొత్త పేరు వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో శ్రావణి సూసైడ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి.
దేవరాజు టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని ఎంతో మంది అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజు ఓ ప్లే బాయ్ అని పోలీసుల విచారణలో స్పష్టమైంది. పలువురు అమ్మాయిలతో దేవరాజు ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా పోలీసుల విచారణలో స్పష్టమైంది.
టిక్‌టాక్ వీడియోల ద్వారా పోలీసులు దేవరాజుకు సంబంధించిన విషయాన్ని నిర్దారించుకున్నారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపినట్టు గుర్తించారు. తనతో పాటు మరికొంతమందితో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచినట్టు గుర్తించారు. ఇదే సమయంలో శ్రావణికి సంబంధించిన వీడియో, ఫోటోలను దేవరాజ్ ఆమెకు చూపించాడు. తన ఫోటోలు, వీడియోలు దేవరాజ్ మొబైల్లో ఉండటంతో శ్రావణి కంగుతిన్నట్టు తెలిసింది. ప్రస్తుతం దేవరాజును ఎస్సార్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ కేసులో ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత అశోక్‌రెడ్డి పేరు కూడా వెలుగు చూసింది. అశోక్‌రెడ్డి ఏటీఎం కార్డులను శ్రావణి వాడేదని.. ఆయన కూడా శ్రావణిని పర్సనల్‌గా చూసుకునేవాడని దేవరాజ్ వెల్లడించాడు. అంతేకాదు.. శ్రావణి, అశోక్‌రెడ్డిల మధ్య జరగిన సంభాషణ ఒకటి కూడా వెలుగు చూసింది. ‘దేవరాజ్ నన్ను వేధిస్తున్నాడు. మన విషయం బయటపెడతానని బెదిరిస్తున్నాడు. మనిద్దరం కలిసి ఉండగా చూశాడు’ అని అశోక్‌రెడ్డికి శ్రావణి చెప్పిన ఫోన్ సంభాషణ ఒకటి లీక్ అయింది. అయితే ఇప్పటి వరకూ దీనిపై అశోక్‌రెడ్డి మాత్రం స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments