అమృతపై బాబాయ్ శ్రవణ్ షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మారుతీరావు ఆత్మహత్యపై తనకు చాలా వరకు బాబాయ్ శ్రవణ్‌పైనే అనుమానాలున్నాయని అమృత మీడియా ముందు వెల్లడించింది. మారుతీరావు అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన అమృత బాబాయ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే అమృత మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికి శ్రవణ్ విలేకరుల ముందుకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అప్పుడు.. ఇప్పుడు!
‘మారుతీ రావు చనిపోయే వరకు ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసింది.
ఇప్పుడు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావుకు నాకు మాటలు లేవు.అమృత విషయంలోనే గొడవలయ్యాయి.
మాటలు లేవనే విషయం వాళ్లకు తెలుసు. కోర్టు శిక్ష ఎలాంటిది పడినా నాకు ఓకే’ అని ఆయన చెప్పుకొచ్చాడు.
నా పేరు ఎందుకు బయటికి రాదు!
‘నా వల్ల ఎవరికైనా వల్ల అపాయం ఉందంటే.. నేను దేనికైనా సిద్ధమే. తండ్రి చస్తే శుభ వార్త అన్న అమృత.. మారుతీ రావు చనిపోయాక ఆయన వెనకాల ఉన్న ఆస్తిపై ప్రేమ పుట్టుకొచ్చింది. డబ్బు కోసమా అమృత డ్రామాలు ఆడుతోంది. మారుతి రావు ఏం తీసుకుపోయాడు.. రేపొద్దున నేనూ ఏమీ తీసుకుపోను.నిన్నటి వరకు తండ్రి చావాలని కోరుకున్న అమృతకు ఇపుడు ఎక్కడి ప్రేమ. అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి.నేను బెదిరించే వాణ్ణి. అయితే నా పేరు ఎందుకు బయటకు రాదు. చచ్చాక ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది.నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాట రావడం లేదు. తల్లి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు.మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. దినాల తర్వాత కలిస్తే నాకేం అవసరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్ళీ నన్ను చంపడానికే అమృత ఏవో ఆరోపణలు చేస్తున్నది’ అని శ్రవణ్ ఆరోపించాడు.
వీలునామా విషయమై..
‘మారుతీరావు తన వీలునామాను 2018 మార్చి రాసాడు. మారుతిరావుకు సంభందించిన ఒక్క పైసా నాకు అక్కర్లేదు. అమృతను మీడియాలో ఎక్కువ షైన్ చేయొద్దు. ఆమెకు మెచూరిటీ లేదు. ఏవేవో మాట్లాడుతోంది. మారుతీరావు పెళ్ళాం మెడలో పుస్తెలతాడు తీస్తేనే నేను తీస్తా అన్నది అమృత. ప్రేమ గల తండ్రిని కోల్పోవడం ఆమె దురదృష్టం. ఆమె పట్ల చాలా ప్రేమతో ఉండేవాడు. ఒక్కనాడు.. ఒక్క మాట కూడా బిడ్డను అనలేదు. ఆర్ధిక లావాదేవీల్లో ఎలాంటి సమస్యలు లేవు. మారుతీరావు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధం.
మాకు ఎలాంటి చేడు అలవాట్లు లేవు’ అని శ్రవణ్ చెప్పుకొచ్చాడు.
అమృత మాట్లాడిన ప్రతీ మాటకూ శ్రవణ్ స్పందించి స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. అయితే బాబాయ్ ఆరోపణలపై అమృత ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే. వీళ్ల గొడవతో మీడియాకు మాత్రం కొన్నిరోజుల పాటు మసాలా దొరుకుతోంది.!.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com