సీనియ‌ర్ న‌రేష్ కొత్త అవ‌తారం..!

  • IndiaGlitz, [Monday,November 21 2016]

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవ‌ల దృశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను శైల‌జ‌, అఆ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు విల‌న్ గా కొత్త అవ‌తారంలో క‌నిపించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ విష‌యాన్ని న‌రేష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...యాక్ష‌న్ ఓరియంటెడ్ మూవీలో విల‌న్ గా న‌టించాలి అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం యాక్ష‌న్ మూవీస్ లో విల‌న్ గా న‌టించే ఆర్టిస్టుల అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇది నాకు న్యూ బిగినింగ్ అంటూ జిమ్ లో ఉన్న త‌న ఫోటోను పోస్ట్ చేసారు న‌రేష్. సో...టాలీవుడ్ కు ఇంకో విల‌న్ దొరికిన‌ట్టే..!