'SR కల్యాణమండపం' సాంగ్.. మనం అమ్మాయిల్ని తిడితే బూతు..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో కిరణ్ అబ్బవరం, క్రేజీ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం SR కల్యాణమండపం. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.
సిగ్గెందుకురా ,మావ అనే సాంగ్ ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. హీరో బార్ లో పెగ్గేసుకుంటూ పెర్ఫామ్ చేసే పాటలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సాంగ్ ని కూడా అలాగే డిజైన్ చేశారు. లిరికల్ వీడియోను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ప్రేయసి ఛీ కొట్టినా సర్దుకుపోవాలి అనే కాన్సెప్ట్ ని గమ్మత్తుగా చూపించారు.
బార్ లో హీరో తన స్నేహితులతో మందేసుకుంటూ తన లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తాడు. 'మనం అమ్మాయిల్ని తిడితే అది బూతు.. అదే అమ్మాయిలు మనల్ని తిడితే స్వీటు లాగా ఫీల్ అవ్వాలి' అంటూ హీరో సాంగ్ లోకి వెళతాడు.
భాస్కర భట్ల మాస్ కు చేరువయ్యే సాహిత్యం అందించారు. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని పాడారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com