800 థియేటర్స్ లో 'స్పైడర్'
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు సినిమాలకు ఓవర్‌సీస్‌లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దూకుడుతో ఓవర్‌సీస్ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన మహేష్.. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1-నేనొక్కడినే, శ్రీమంతుడు చిత్రాలతో తన హవాను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో మహేష్ కొత్త చిత్రం స్పైడర్ ని యుఎస్ఎలో దాదాపు 800 థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీతమందించారు. ఈ నెల 27న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments